వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అజిత్ ఆంటోనీకి రామ్ చరణ్ తేజ్ సలహా

By Pratap
|
Google Oneindia TeluguNews

Ram Charan Teja
సినీ రంగంలోకి అడుగు పెట్టిన రక్షణ శాఖ మంత్రి ఎకె ఆంటోనీ కుమారుడు అజిత్ ఆంటోనీకి మన హీరో రామ్ చరణ్ తేజ సలహాలు ఇచ్చాడట. అజిత్ ఆంటోనీ ఓ మలయాళం సినిమాలో నటిస్తున్నాడు. అదే సయమంలో తమిళంలో కూడా ఆ సినిమా నిర్మాణం జరుగుతోంది. రక్షణ శాఖ మంత్రి ఎకె ఆంటోనీ ఆ మధ్య కాంగ్రెసు శాసనసభ్యుడు, మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. ఈ సమయంలో చిరంజీవి నుంచి సినీ రంగానికి సంబంధించిన వివరాలను తెలుసుకున్నారని వినికిడి.

చిరంజీవితో మాట్లాడిన తర్వాత ఆంటోనీ ప్రత్యేకంగా రామ్ చరణ్ తేజతో సమావేశమయ్యారట. తన కుమారుడికి అవసరమైన సలహాలను ఆయన చెర్రీ నుంచి అడిగి తెలుసుకున్నట్లు చెబుతున్నారు. సినిమా రంగంలో ఎలా మసలుకోవాలనే విషయాలపై ఆంటోనీ చెర్రీ నుంచి సేకరించి ఆ టిప్స్‌ను అజిత్ ఆంటోనీకి అందించారట.

English summary
It is said that Chiranjeevi's son Ram Charan Teja has given some tips to Ajith Antony, son of Union minister AK Antony.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X