వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిబిఐ ముందుకు మరో వైయస్ జమానా అధికారి?

By Pratap
|
Google Oneindia TeluguNews

CBI Logo
వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో కీలక పాత్ర పోషించిన మరో ఉన్నతాధికారి కూడా సిబిఐ ముందుకు విచారణ నిమిత్తం హాజరు కానున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పనిచేసి పదవీ విరమణ చేసినన పి. రమాకాంత్ రెడ్డిని సిబిఐ విచారణకు పిలిచినట్లు తెలుస్తోంది. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో రమాకాంత్ రెడ్డి చీఫ్ సెక్రటరీగా పనిచేశారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో మంజురైన పలు మౌలిక సదుపాయాల, పారిశ్రామిక ప్రాజెక్టులకు సంబంధించిన ఫైళ్లపై రమాకాంత్ రెడ్డి చీఫ్ సెక్రటరీ హోదాలో సంతకాలు చేసినట్లు చెబుతున్నారు. దీంతో రమాకాంత్ రెడ్డిని విచారించడానికి సిబిఐ సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది.

తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ పెద్ద యెత్తున సొమ్మును పోగు చేశారని సిబిఐ ఆరోపిస్తోంది. పలు సంస్థలు జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టడానికి వైయస్ అధికారమే కారణమని చెబుతున్నారు. ఎన్. ప్రసాద్‌కు చెందిన వాన్‌పిక్ పోర్టు ప్రాజెక్టుపై సిబిఐ రమాకాంత్ రెడ్డిని విచారించే అవకాశం ఉంది. గురువారం తమ ముందు హాజరు కావాలని సాధారణ పరిపాలనా శాఖ (రాజకీయ) ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ మిశ్రాను తమ ముందు హాజరు కావాలని సిబిఐ ఆదేశించింది.

English summary
Some more serving and retired bureaucrats, including State Election Commissioner P. Ramakanth Reddy will be joining the queue at the Dilkusha Guest House to get quizzed by the CBI.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X