వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రావణుడే దేవుడు, తిరగరాస్తారా...

By Pratap
|
Google Oneindia TeluguNews

Kancha Ilaiah
హైదరాబాద్: విలువలను తిరిగేస్తున్నారా అని అనిపిస్తోంది. విలువలను తిరిగేయడంలో రాక్షసులు దేవుళ్లుగానూ దేవుళ్లు రాక్షసులగానూ మారిపోతున్నారని అనిపిస్తోంది. ద్రవిడ సంస్కృతిలో రావణుడిని పూజించడం, ఆరాధించడం ఉంది. దాన్ని మెయిన్ స్ట్రీమ్‌లోకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు కనిపిస్తోంది. వై ఐ యామ్ నాట్ ఏ హందూ (నేను హిందువునెట్లయిత) గ్రంథంతో ప్రపంచ ప్రఖ్యాతిని సంపాదించుకున్న ప్రొఫెసర్ కంచ ఐలయ్య విలువలను తిరిగేయడం గురించి చాలా కాలం నుంచి మాట్లాడుతున్నారు.

తాజాగా, రావణుడిని వర్ధంతిని జరిపే విషయంపై ఆయన మాట్లాడారు. రావణుడి చరిత్రను తిరగ రాసి పాఠ్యాంశాల్లో చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. బ్రాహ్మణులు, క్షత్రియులు కుట్రపన్ని వక్రీకరించి, రావణుడిని రాక్షసుడిగా వక్రీకరించారని ఆరోపించారు. హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో బహుజనసేన ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన రావణుడి వర్ధంతి సభలో ఆయన మాట్లాడారు.

రావణుడితో పాటు బలిచక్రవర్తి, శూర్పణఖ, నరకాసురుడు నీతిపరులని ఆయన కితాబిచ్చారు. ఇతరులను రాజ్యాలను వారెవరు దోచుకోలేదని, ప్రజలకు ఆదర్శవంతమైన పాలనను అందించి పురాణాల్లో నిలిచిపోయారని ఐలయ్య అన్నారు.

సభలో విమర్శకుడు సురేందర్ రాజు, బహుజన నేత కదిరె కృష్ణ, రచయిత కొత్త శివమూర్తి, మేకపోతుల నరేందర్‌గౌడ్, మంచాల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. విమర్శకుడు సురేందర్ రాజు అసురగా ప్రసిద్ధుడు. ఆసుర అంటే రాక్షసుడు. రాక్షసులను క్రూరులుగానూ నరమాంస భక్షకులుగానూ చిత్రీకరించారని ఆయన వాదిస్తారు. ద్రవిడులను రాక్షసులుగా చిత్రీకరించి చరిత్రను వక్రీకరించారని దళిత బహుజనులు వాదిస్తున్నారు. ఏమైనా, వారు వీరు కావడం అనేది కూడా చరిత్రలో భాగమేమో.

English summary
Praising Ravana, a meeting was organised during his birth anniversary. An eminent writer and professor Kancha Ilaiah demanded to re - write Ravana's history.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X