వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేణుకా చౌదరి తెలంగాణ కార్డు

By Pratap
|
Google Oneindia TeluguNews

Renuka Chowdhury
మాజీ పార్లమెంటు సభ్యురాలు రేణుకా చౌదరి తెలంగాణ కార్డును వాడుకోవడానికి సిద్ధపడ్డారు. రాజ్యసభ సీటును దక్కించుకోవడానికి ఆమె తెలంగాణ కార్డును వాడుతున్నారు. ఇటీవల కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ హైదరాబాదు వచ్చినప్పుడు ఆమె అల్పాహార విందు ఇచ్చారు. ఈ అల్పాహార విందుకు తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకులను, కాంగ్రెసు తెలంగాణ శాసనసభ్యులను ఆహ్వానించారు. ఆ విధంగా తెలంగాణ నాయకులు తన వెంట ఉన్నారని ఆజాద్‌కు చూపించడానికి ఆమె ప్రయత్నించారట. జెఎసి నాయకులు స్వామి గౌడ్, వి. శ్రీనివాస గౌడ్, దేవీప్రసాద్‌లను ఆమె తన ఇంటికి ఆహ్వానించారు. తనకు మద్దతు ఇవ్వాలని వారు ఆమెను కోరారు. అయితే, సకల జనుల సమ్మె విరమణ సందర్భంగా తమకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసేలా చూస్తే మద్దతు ఇవ్వడానికి తమకు అభ్యంతరం లేదని వారు చెప్పారట.

అప్పటికే తెలంగాణకు చెందిన డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు డి. నాగేందర్, ముఖేష్ గౌడ్, కాంగ్రెసు శాసనసభ్యుడు జయప్రకాష్ రెడ్డి రేణుకా చౌదరి నివాసంలో ఉన్నట్లు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును తాను దీటుగా ఎదుర్కుంటానని కూడా రేణుకా చౌదరి ఆజాద్‌కు హామీ ఇచ్చారని తెలుస్తోంది. తాను 20 ఏళ్ల పాటు తెలంగాణ నుంచి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్నానని, అందువల్ల తనను తెలంగాణకు చెందిన నేతగా తీసుకుంటారని ఆమె నమ్మబలికే ప్రయత్నం చేశారని కూడా అంటున్నారు. పదవికి ఏ కార్డు అవసరమైతే ఆ కార్డు వాడుతారనే విషయానికి రేణుకా చౌదరి మినహాయింపేమీ కారని అర్థమవుతోంది.

English summary
Former Congress MP from Khammam and now AICC spokesperson Renuka Chowdhury has fallen back on Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X