వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సాక్షిపై చర్యల సమాచారం చంద్రబాబుకు?

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
వైయస్ జగన్‌కు చెందిన సాక్షి దినపత్రికపై తీసుకునే చర్యల సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి అందజేస్తున్నారట. ఈ విషయంపై సాక్షి దినపత్రిక సోమవారం ఓ వార్తాకథనాన్ని ప్రచురించింది. తమకు ప్రభుత్వ ప్రకటనల జారీని నిలిపేస్తూ జీవో జారీ చేయడానికి ముందు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సుదీర్ఘంగా కసరత్తు చేసినట్లు కూడా రాసింది. తనకు సాక్షిపై చర్యలకు సంబంధించిన సమాచారం అందడం వల్లనే చంద్రబాబు సాక్షిపై దాడిని పెంచాలని, సాక్షిపై చర్యలు తీసుకోబోతున్నారని తమ పార్టీ నాయకులకు చెప్పినట్లు రాసింది.

ముఖ్యమంత్రి చేసిన కసరత్తు వివరాలు డెక్కన్ క్రానికల్ పత్రికకు లీకైనట్లు కూడా సాక్షి రాసింది. ఇందుకు సాక్ష్యంగా ఏప్రిల్ డెక్కన్ క్రానికల్ రాసిన వార్తాకథనాన్ని నిదర్శనంగా చూపింది. సాక్షిని టార్గెట్ చేస్తూ తెరవ వెనక పెద్ద గూడుపుఠానీ జరిగినట్లు ఆరోపించింది. అందులో భాగంగానే సిబిఐ సాక్షి మీడియా బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసిందని, అది జరిగిన మర్నాడు రాత్రికి రాత్రి సాక్షికి ప్రభుత్వ ప్రకటనలను నిలిపేస్తూ జీవో జారీ చేశారని చెప్పింది.

ఆ చర్యలు తీసుకోవడానికి ముందు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో దఫాలు దఫాలుగా సమావేశాలు జరిగినట్లు సాక్షి రాసింది. సాక్షిపై చర్యలు తీసుకోవడానికి రెండు రోజుల ముందు సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మినారాయణ రాత్రి వేళ ముఖ్యమంత్రితో సమావేశమైనట్లు రాసింది. ఆ సమయంలో అడ్వొకేట్ జనరల్ కూడా అక్కడ ఉన్నారని రాసింది.

డెక్కన్ క్రానికల్ వార్తలను నిజం చేసేలా ప్రభుత్వం, సిబిఐ చర్యలున్నాయని సాక్షి వ్యాఖ్యానించింది. జగతి పబ్లికేషన్స్ ఆస్తులను కూడా సిబిఐ స్వాధీనం చేసుకుంటుందని డెక్కన్ క్రానికల్ ఈ నెల 12వ తేదీన ఓ వార్త రాసింది. ఈ వార్త కూడా నిజమవుతుందా అనే ప్రశ్న వేయడానికి జగన్‌పై కక్ష సాధించడానికి సిబిఐ దర్యాప్తు పేరుతో మొత్తంగా సాక్షి గొంతునే నొక్కేసే కుట్ర జరుగుతోందనేది స్పష్టంగా తేలిపోతోందని సాక్షి వ్యాఖ్యానించింది.

English summary
YSR Congress president YS Jagan's Sakshi daily accused VM Kiran kumar Reddy for issuing GO stopping governmrnt adcertisement ti Sakshi daily. It also made comment that the information is forwarding to Telugudesam president N Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X