• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ధనుష్ కోలావేరికి శింబు లవ్ ఆంథం కౌంటర్?

By Srinivas
|

simbu
ధనుష్ కోలావేరి డి పాటకు శింబు ప్రేమ గీతం కౌంటర్ ఇచ్చింది! ప్రేమ విఫలం కావడంతో ఓ ప్రియుడు వేధనతో పాడే పాట కోలావేరి డి. ఈ పాట ఎంతగా ఆదరణ పొందిందో అందరికీ తెలిసిందే. ధనుష్ సొంతగా రాసి పాడిన ఈ పాట బట్లర్ ఇంగ్లీష్‌తో కూడుకుంది. ఇందులో ప్రేమికురాలి పైన కామెంట్స్ ఉంటాయి. ఇందుకు పూర్తి విరుద్ధంగా శింబు లవ్ ఆంథం పేరుతో కొత్త పాటతో ముందుకు వచ్చారు. ధనుష్ పాట వేధనాభరితమైతే శింబు పాట ఎనర్జిటిక్‌తో కూడుకున్నది. ఇటీవలె వచ్చిన ఈ పాటలో లవ్ అంటే ఎనర్జిటిక్ లైఫ్ అంటున్నాడు శింబు. ప్రపంచమంతా లవ్ ఆంథం పాడాలంటున్నారు.

అతి తక్కువ సమయంలో కోలావేరి పాట దాదాపు మూడు కోట్లకు పైగా హిట్స్ సాధించింది. శింబు లవ్ ఆంథం కూడా మంచి హిట్స్ సాధిస్తోంది. ఐదు రోజుల క్రితం నెట్‌లో పెట్టిన శింబు పాటకు ఇప్పటి వరకు ఎనిమిది లక్షలకు పైగా హిట్స్ వచ్చాయి. ధనుష్, శింబు పాటలను పోల్చడంపై చాలామంది స్పందిస్తూ కామెంట్స్ పంపిస్తున్నారు కూడా.

English summary
Hero Simbu sung a energytic song on love. It getting many hits. It is posted on 27th of December.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X