హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాష్టపతి ప్రతిభా పాటిల్ బాత్రూంలో పాము

By Pratap
|
Google Oneindia TeluguNews

Pratibha Patil
దక్షిణ భారత విడిదికి వచ్చిన రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌ పాముల బెడదను ఎదుర్కుంటున్నారు. 12 రోజుల క్రితం ఆమె హైదరాబాద్ వచ్చారు. ఆమె వచ్చినప్పటి నుంచి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో నెహ్రూ జంతు ప్రదర్శనశాల ప్రత్యేక బృందం పది పాములను పడట్టుకుంది. ఓ పామైతే రాష్ట్రపతి బాత్రూంలో కనిపించింది. ప్రతి ఏడాది రాష్ట్రపతి నిలయంలో పాముల కోసం ప్రత్యేకంగా సిబ్బంది రంగంలోకి దిగాల్సి వస్తోంది.

రాష్ట్రపతి దిగడానికి ముందే సిబ్బంది నాగు పాములను, రేస్‌లను, ఇతర పాములను పట్టుకున్నారు. 11 రోజుల పాటు రాష్ట్రపతి నిలయంలో బస చేసిన ప్రతిభా పాటిల్ బుధవారం న్యూఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. రాష్ట్రపతి రావడానికి ఒక రోజు ముందు బాత్రూంలో రేసర్‌ను పట్టుకున్నట్లు చెబుతున్నారు. కోబ్రాను ప్రదర్శన కోసం జంతు ప్రదర్శనశాలలో ఉంచి, మిగతా పాములను స్నేక్ సఫారీలో వదిలేసినట్లు ఆ ఆంగ్ల దినపత్రిక రాసింది.

English summary
A day before President Pratibha Patil arrived here for her annual southern sojourn 11 days ago, as many as 10 snakes were caught by a special team deputed by the Nehru Zoological Park at Rashtrapathi Nilayam in Bolarum.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X