వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీలక్ష్మి వైరాగ్యం: కూతుళ్లతోనూ నో ములాఖత్

By Pratap
|
Google Oneindia TeluguNews

Srilaxmi
కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి ఒఎంసి అక్రమ మైనింగ్ కేసులో అరెస్టయిన ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మిని వైరాగ్యం ఆవహించినట్లే ఉందని అంటున్నారు. గత ఆరు నెలలుగా ఆమె జైలులో ఉన్నారు. అయితే, ఆమె ములాఖత్‌లో భర్త గోపికృష్ణను తప్ప ఎవరినీ కలుసుకోవడానికి ఇష్టపడడం లేదని వార్తలు వచ్చాయి. తన కూతుర్లను కలుసుకోవడానికి కూడా ఆమె ఇష్టపడడం లేదని అంటున్నారు.

ఇతర విఐపి ఖైదీలను కలుసుకోవడానికి నిరంతరం బంధువులు, కుటుంబ సభ్యులు వస్తున్నారు. కానీ శ్రీలక్ష్మి మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నట్లు చెబుతున్నారు. పైగా, తనకు ప్రత్యేక ఖైదీ హోదా ఇచ్చినప్పటికీ అతి సాధారణ జీవితాన్నే ఆమె జైలులో ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఉయం సాయంత్రం వాకింగ్, పత్రికలు, ఆధ్యాత్మిక పుస్తకాల పఠనం, దైవ ప్రార్థన ఆమె దినచర్యగా మారినట్లు తెలుస్తోంది.

జైలు అధికారులు అందించిన సరుకులతోనే ఆమె వంట చేయించుకుని తింటున్నట్లు కూడా చెబుతున్నారు. ఒఎంసి కేసులో నిందితురాలైన శ్రీలక్ష్మిని సిబిఐ అధికారులు 2011 డిసెంబర్ 1వ తేదీన అరెస్టు చేశారు. చంచల్‌గుడాలోని మహిళా జైలుకు వచ్చిన ఆమెకు మరుసటి రోజే బెయిల్ లభించింది. దీంతో ఆమె బయటకు వచ్చారు. అయితే హైకోర్టు ఆమె బెయిల్‌ను రద్దు చేసింది. దీంతో ఆమె 2012 జనవరి 6వ తేదీన కోర్టులో లొంగిపోయారు.

దాంతో ఆమె మళ్లీ చంచల్‌గుడాలోని మహిళా జైలుకు వచ్చారు. అప్పటి నుంచి ఆమె రెండు సార్లు న్యాయవాదితో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత భర్త గోపికృష్ణను మాత్రమే ఆమె ములాఖత్‌లో కలుసుకుంటున్నారట. ఆమె తన ఇద్దరు కూతుళ్లను ఇప్పటి వరకు కలుసుకోలేదని చెబుతున్నారు.

English summary
It is said that IAS officer Srilakshmi is not showing interest to meet others except her husband Gopikrishna in jail mulakhath. She was arrested on December 1, 2012 in Gali Janardhan reddy OMC case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X