వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తిరుమల ప్రధానార్చకుడి ప్రైవేట్ దీవెనలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Ramana Deekshitulu
తిరుమల ప్రధానార్చకుడు ఎవి రమణదీక్షితులు మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఓ పారిశ్రామికవేత్త కుమారుడికి ఆయన ప్రైవేట్ ఆశీస్సులు అందించారు. ఆ పారిశ్రామికవేత్త ఉంటున్న అతిథి గృహానికి వెళ్లి అర్చన చేసి ఆశీస్సులు అందజేశారు. ఈ సంఘటన ఆదివారంనాడు జరిగింది. కెమెరామెన్ ఆ సంఘటనను చిత్రీకరించడానికి ప్రయత్నించారు. దాంతో ఆయన కారులో ఎక్కి వెళ్లిపోయారని వార్తలు వచ్చాయి.

రమణదీక్షితులు వివాదంలో చిక్కుకోవడం ఇదే మొదటిసారి కాదు. ఆలయ నిబంధనలను అతిక్రమించి ఓ పారిశ్రామికవేత్త అతిథి గృహంలో కార్యక్రమాలు నిర్వహించినందుకు 2010 ఏప్రిల్ 10వ తేదీన ఆయనకు తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) అధికార యంత్రాంగం మెమో జారీ చేసింది. పారిశ్రామికవేత్తలు, బడా వ్యాపారులు, సినీ తారలతో, సెలబ్రిటీలతో ఆయన భుజం భుజం రాసుకంటూ తిరుగుతారనే అభిప్రాయం ఉంది. ప్రధానార్చకుడిగా రమణదీక్షితులు స్వామి సేవలో మాత్రమే ఉండాలని అంటారు.

ఆగమ శాస్త్ర సూత్రాల ప్రకారం ఆలయ ఆచారాలు, సంప్రదాయాలకు కట్టుబడి స్వామివారి సేవకు మాత్రమే అంకితం కావాలని పండితులు అంటున్నారు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డికి, వైయస్ జగన్‌కు రమణదీక్షితులు 2009లో తిరుమలలో సుదర్శన హోమం నిర్వహించారని తిరుమల ఆలయ సంరక్షణ సమితికి చెందిన నరేంద్ర ఆరోపిస్తున్నారు. వైయస్సార్ కోసం రమణదీక్షితులు పులివెందుల, హైదరాబాదు వెళ్లినట్లు కూడా ఆయన చెబుతున్నారు.

ఆలయ సంప్రదాయాలను ధిక్కరించిన రమణదీక్షితులుపై టిటిడి ఏ విధమైన చర్యలు తీసుకుంటుందనేది వేచి చూడాల్సిందే. తరుచుగా సంప్రదాయాలను అతిక్రమిస్తున్న రమణదీక్షితులుపై చర్యలు తీసుకోవాల్సిందేనని కొంత మంది డిమాండ్ చేస్తున్నారు.

English summary
Chief priest A V Ramana Deekshitulu landed himself in a fresh controversy when he went to meet a top industrialist's son at a private guest house here on Sunday. Deekshitulu was closeted with industrialist's son for a brief while in the evening to bless him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X