వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

"కెసిఆర్‌కు తాబేదారు: లగడపాటికి పెయిడ్ అర్టిస్టు"

By Pratap
|
Google Oneindia TeluguNews

Vasantha Nageswar
విజయవాడ: ప్రత్యేకాంధ్ర, సమైక్యాంధ్ర నేతల మధ్య వివాదం ముదురుతోంది. సమైక్యాంధ్రను కోరుతున్న మాజీ శాసనసభ్యుడు అడుసుమిల్లి జయప్రకాష్, ప్రత్యేకాంధ్రను డిమాండ్ చేస్తున్న జై ఆంధ్ర నాయకుడు వసంత నాగేశ్వర రావుకు మధ్య పరస్పర విమర్శలు పదునెక్కుతున్నాయి. వసంత నాగేశ్వర రావు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుకు అమ్ముడుపోయారని, కెసిఆర్‌కు తాబేదారుగా వ్యవహరిస్తున్నారని అడుసుమిల్లి జయప్రకాష్ వసంత నాగేశ్వర రావుపై దుమ్మెత్తి పోశారు.

పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌కు అడుసుమిల్లి జయప్రకాష్ పెయిడ్ ఆర్టిస్టుగా పనిచేస్తున్నారని, అటువంటి జయప్రకాష్ తనపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని వసంత నాగేశ్వర రావు అన్నారు. తాను తాగి పారేసిన టీ గ్లాసుల ఖరీదు చేయని అడుసుమిల్లి జయప్రకాష్ తాను అమ్ముడుపోయానని ఆరోపించడం హేయమని ఆయన అన్నారు.

కెసిఆర్ ఇచ్చిన డబ్బులు తీసుకుని కుంచికచర్లలో రూ. 10లక్షలు ఖర్చు చేసి జై ఆంధ్ర సభను వసంత నాగేశ్వర రావు నిర్వహించారని అడుసుమిల్లి జయప్రకాష్ ఆరోపించారు. వసంత నాగేశ్వరరావు 2009 డిసెంబర్ 9వ తేదీన నిమ్స్‌లో కెసిఆర్‌తో 45 నిమిషాల పాటు రహస్య మంతనాలు జరిపారని ఆయన అన్నారు. తెరాస కండువా కప్పుకుని వసంత నాగేశ్వర రావు కెసిఆర్‌తో మంతనాలు జరిపారని ఆయన ఆరోపించారు.

ఆంధ్ర రాష్ట్ర చరిత్ర తెలియని హీనులు స్క్రీప్టులు రాయించుకుని మీడియాలోనూ, వేదికలపైన మాట్లాడుతున్నారని వసంత నాగేశ్వరరావు అన్నారు. పొట్టి శ్రీరాములు పోరాటం చేసిన ఆంధ్ర ఉద్యమంలో తెలంగాణ ప్రసక్తి లేదనే విషయాన్ని వారు తెలుసుకోవాలని ఆయన అన్నారు. కాకాని వెంకటరత్నం, తెన్నేటి విశ్వనాథం, గౌతు లచ్చన్న వంటి నాయకులు ప్రత్యేకాంధ్ర రాష్ట్రం కోరుతూ ఉద్యమాలు చేశారని గుర్తు చేస్తూ వారు కూడా చరిత్ర హీనులేనా అని వసంత నాగేశ్వర రావు అడిగారు. ఏమైనా, ఆంధ్రలో సమైక్యాంధ్ర, ప్ర్తత్యేకాంధ్ర నాయకుల మధ్య విభేదాలు పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.

English summary
Sanaikyandhra leader Adusumilli Jayaprakash and separate Andhra leader Vasntha Nageswar Rao habe made allegations against each other. Vasnatha Nageswar Rao termed Jayaprakash as paid artist of MP Lagadapati Rajagopal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X