వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిర్మాత సి. కళ్యాణ్ భాను కిరణ్ బాధితుడే

By Pratap
|
Google Oneindia TeluguNews

C Kalyan
రముఖ సినీ నిర్మాత సి. కళ్యాణ్ ఒకప్పుడు భాను కిరణ్ బాధితుడేనట. మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్ బినామీగా సి. కళ్యాణ్‌ను చెబుతున్నారు. బాధించే క్రమంలోనే కళ్యాణ్ భానుకు దగ్గరైనట్లు సమాచారం. రామ్ గోపాల్ వర్మ రక్త చరిత్ర సినిమా నిర్మాణ సమయంలో వారిద్దరు దగ్గరైనట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు కళ్యాణ్‌కు, భానుకు మధ్య గల సంబంధాలపై సిఐడి దర్యాప్తు చేస్తోంది.

కళ్యాణ్‌తో భాను మొదటి పరిచయం 2007లో ఏర్పడిందని అంటున్నారు. అయితే, మద్దెలచెర్వు సూరికి సన్నిహితుడైన నిర్మాత మధుసూదన్ రెడ్డి తరఫున భాను కిరణ్ భూవివాదంలో భాను కిరణ్ జోక్యం చేసుకున్నట్లు, ఇందులో అవతలి తరఫున కళ్యాణ్ ఉన్నారని టైమ్స్ ఆఫ్ ఇండియా రాసింది. మధుసూదన్ రెడ్డి తన ఇంట్లోకి చొరబడ్డాడంటూ కళ్యాణ్ మాదాపూర్ పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేశారు. అయితే సూరికి మధుసూదన్ రెడ్డి సన్నిహితుడని తెలుసుకుని వివాదాన్ని పరిష్కారం చేసుకున్నారు.

రక్త చరిత్ర నిర్మాణ క్రమంలోనే కళ్యాణ్ భానుకు దగ్గరయినట్లు ఆ పత్రిక రాసింది. పరిటాల రవికి, సూరికి మధ్య గల ఫాక్షన్ తగాదాలను తెలుసుకోవడానికి అనంతపురం వచ్చిన రామ్ గోపాల్ వర్మ వెంట సూరి, భానులతో పాటు కళ్యాణ్ కూడా ఉన్నట్లు చెబుతున్నారు. రక్తచరిత్ర 1, 2 తెలుగు హక్కులను కళ్యాణ్ కొనుగోలు చేశారు.

కళ్యాణ్‌కు చెందిన బాలాజీ కలర్ ల్యాబ్‌ను సెటిల్మెంట్లకు డెన్‌గా వాడినట్లు చెబుతారు. తన కుమారులతో ఏర్పడిన తగాదాల పరిష్కారానికి లక్ష్మి ఫిల్మ్స్‌కు చెందిన సుభాష్ చంద్ర బోస్ 2010లో కళ్యాణ్‌ను ఆశ్రయించినట్లు చెబుతారు. బోస్ కుమారుడు ఒకతను భాను అశ్రయించాడట. దీంతో బాలాజీ కలర్ ల్యాబ్‌లోనే ఆ వివాదాన్ని పరిష్కరించారని అధికారులు చెప్పినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా రాసింది.

English summary
According to news reports - If you can't beat them, join them. Producer C Kalyan seems to have followed the dictum in toto. He was once a victim of gangster Bhanu Kiran, but eventually became a close aide of the gangster after he worked with him during the making of Ramgopal Verma's 'Raktha Charitra'.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X