• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఇప్పుడు సూరీడు ఏం చేస్తున్నాడు?

By Pratap
|

Sureedu
ఒకప్పుడు సూర్యనారాయణ రెడ్డి అలియాస్ సూరీడు ఒక వెలుగు వెలిగారు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి వ్యక్తిగత సహాయకుడిగా సూరీడికి పెద్ద ఇమేజే ఉండేది. ఎవరికి వారు సూరీడితో సంబంధాలు పెట్టుకోవడానికి, ఆయనను కలవడానికి ప్రయత్నించేవారు. వైయస్ రాజశేఖర రెడ్డి మరణంతో ఒక్కసారిగా ఆయన జాతకం మారిపోయింది. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారనే ప్రశ్న ఉదయిస్తోంది.

సూరీడు ఇప్పుడు ఖాళీగానే ఉన్నారట. తాజాగా, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలవడానికి వచ్చి ఓసారి వార్తల్లోకి ఎక్కారు. అప్పట్లో పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వెనక నిలబడి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో సిబిఐకి వాంగ్మూలం ఇచ్చి వార్తల్లో నిలిచాడు. అయితే, ఆయన గురించి పెద్దగా వార్తలు రావడం లేదు.

అయితే, ఖాళీగా ఉండడానికి సూరీడు ఏ మాత్రం ఇష్టపడడం లేదని అంటున్నారు. కాంగ్రెసు పార్టీ పెద్దలకు దగ్గర కావడానికి ఆయన ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. అధిష్టానం పెద్దలు వచ్చినప్పుడు ఆయన తప్పకుండా వారిని కలవడానికి ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. ఇటీవల కేంద్ర పరిశీలకుడిగా కేంద్ర మంత్రి వాయలార్ రవి పలు మార్లు హైదరాబాదు వచ్చారు.

వాయలార్ రవిని సూరీడు కలుసుకుని నమస్కారం చేశారట. ఆ వెంటన వాయలార్ రవి సూరీడితో కాసేపు ముచ్చటించి, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నట్లు చెబుతున్నారు. అలాగే, రాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రణబ్ ముఖర్జీ కూడా హైదరాబాదు వచ్చారు. ఆ సమయంలో కూడా సూరీడు ప్రణబ్ ముఖర్జీకి కనిపించారని అంటున్నారు. ఏమైనా, సూరీడు మౌనంగా ఉండడానికి సిద్దంగా లేరని అంటున్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
It is said that earstwhile YS Rajasekhar Reddy's personal assistant Suryanarayana Reddy alias Sureedu is trying to meet Congress top leaders. He met CM Kiran kumar Reddy Tuesday. It is learnt that her preapred to associate with Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more