వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ జగన్ ఎమ్మెల్యే ఎందుకు తగ్గారు?

By Pratap
|
Google Oneindia TeluguNews

Pilli Subash Chandra Bose
తన శానససభా సభ్యత్వానికి రాజీనామా చేసిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యుడు పిల్లి సుభాష్ చంద్ర బోస్ ఎందుకు వెనక్కి తగ్గారనేది ఆసక్తికరంగా ఉంది. ఆయన తన రాజీనామా లేఖను స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు సమర్పించి, సభలో మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరారు. వైయస్ జగన్ వర్గం శాసనసభ్యులు రాజీనామా చేసినా, వెనక్కి తగ్గినా, ఏం చేసినా అదో ఆసక్తికరమైన విషయమే అవుతుంది. పైగా, పిల్లి సుభాష్ చంద్రబోస్ వైయస్ జగన్ వర్గంలో కీలకమైన నేత. అటువంటప్పుడు అది చర్చకు దారి తీయడం మామూలే.

అయితే, తన నియోజకవర్గానికి నిధుల మంజూరులో వివక్ష ప్రదర్శిస్తున్నారంటూ ఆయన రాజీనామా చేశారని అంటున్నారు. రాజీనామాపై ఆయన బుధవారం స్పీకర్‌ను కలిశారు. స్పీకర్ ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితోనూ తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌తోనూ మాట్లాడిన తర్వాత పిల్లి సుభాష్ చంద్రబోస్ వెనక్కి తగ్గారని అంటున్నారు.

English summary
Withdrawing of a resignation of YS Jagan camp MLA Pilli Subhash Chandrabose became a hot topic.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X