ఒంగోలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వాన్‌పిక్‌లో జగన్ పార్టీ అభ్యర్థి బాలినేని?

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
అరెస్టయి జైలులో ఉన్న పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌కు చెందిన వాన్‌పిక్ ప్రాజెక్టు వ్యవహారంలో వైయస్ జగన్ నేతృత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఒంగోలు శానససభా నియోజకవర్గం అభ్యర్థి, మాజీ మంత్రి పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రకాశం జిల్లాకు చెందిన బాలినేని శ్రీనివాస రెడ్డి వైయస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో గనుల శాఖ మంత్రిగా పనిచేశారు. అయితే, తనపై వస్తున్న ఆరోపణలకు బాలినేని దీటుగా సమాధానం ఇస్తున్నారు.

వాన్‌పిక్ ప్రమోటర్ల నుంచి తాను డబ్బులు తీసుకున్నానని మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ గానీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రాబబు నాయుడు గానీ రుజువు చేస్తే తాను పోటీ నుంచి తప్పుకుంటానని ఆయన సవాల్ విసిరారు. తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఉప ఎన్నికల్లో ప్రయోజనం పొందడానికే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు.

వాన్‌పిక్ ప్రాజెక్టుకు భూములు స్వాధీనం చేయడంలో బాలినేని 300 కోట్ల రూపాయలు తీసుకున్నారని డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆరోపించారు. దాన్ని బాలినేని తీవ్రంగా ఖండించారు. తనపై చేసిన ఆరోపణను రుజువు చేయాలి లేదా మంత్రి పదవి నుంచి తప్పుకోవాలని ఆయన డొక్కా మాణిక్య వరప్రసాద్‌ను సవాల్ చేశారు.

తనపై ఆరోపణల మీద బహిరంగ చర్చకు తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీల నాయకులతో సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పారు. బాలినేనిని అరెస్టు చేయాలని చంద్రబాబు ఓ సందర్భంలో అన్నారు. దీనికి బాలినేని ప్రతిస్పందిస్తూ అవినీతి ఆరోపణల్లో సిబిఐ అరెస్టుకు చంద్రబాబు సిద్ధపడాలని ఆయన అన్నారు.

English summary
Upping the ante ahead of the bypolls, Ongole Assembly constituency YSR Congress nominee and former minister Balineni Srinivasa Reddy has offered to back down from the contest if his rivals can prove that he was involved in the Vanpic project.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X