anantha venkatrami reddy telangana samaikyandhra pc chacko అనంత వెంకట్రామి రెడ్డి తెలంగాణ సమైక్యాంధ్ర పిసి చాకో
ఢిల్లీ పెద్దకు ఎంపీ నిలదీత: అప్పుడేం చేశారని షిండే

విభజనపై గతంలోను ఇలాగే వాస్తవాలు తెలియకుండా మాట్లాడారని, ప్రజలంతా సమైక్యాంధ్రనే కోరుకుంటున్నారని, హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేయడం కోసం ఎవరూ అడగడం లేదని చాకోను ఒకింత నిలదీసినట్లుగానే అడిగారట. పదేళ్లు కేంద్ర పాలిత ప్రాంతం అంటే ప్రజలు అంగీకరించరని, చేస్తే శాశ్వతంగా యుటి చేయాలని.. అలా చేస్తే తెలంగాణవాళ్లు అంగీకరిస్తారా, ఇన్ని సమస్యల నేపథ్యంలో విభజన ఏలా సాధ్యమని ప్రశ్నించారట.
మరోవైపు కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే కూడా సీమాంధ్ర పార్లమెంటు సభ్యులను ఇదివరకేం చేశారని ప్రశ్నించారు. ఆయనను సీమాంధ్ర ఎంపీలు కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పుడు సమైక్యాంధ్ర ఉద్యమం అని వస్తున్న మీరు ఇది వరకు తెలంగాణలో ఉద్యమం జరుగుతున్నప్పుడు మీ ప్రాంతంలో ఏ ఉద్యమాలు లేవని వ్యాఖ్యానించారట.
అందుకు ఎంపీలు స్పందిస్తూ.. కలిసుండాలనే ఉద్దేశ్యంతో తాము ఎలాంటి ఆందోళనలకు దిగలేదని, సీమాంధ్ర ప్రాంతంలో కాంగ్రెసు పార్టీని ఎలా బతికిస్తారని, రెండుసార్లు రాష్ట్ర ప్రజలు ఓటేయడం వల్ల అందరం ఇక్కడున్నామని, అలాంటిది ఇప్పుడు ఏకపక్షంగా విభజన ఎలా చేస్తారని ఎంపీలు ప్రశ్నించారు.