వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సినీనటి అంజలి వైద్యుడి ప్రేమలో పడిందా?

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి అదృశ్యమైన సినీ నటి అంజలి వ్యక్తిగత వైద్యుడితో ప్రేమలో పడిందనే ప్రచారం సాగుతోంది. ఈ మాట ఆమె పిన్ని భారతీదేవి అంటోంది. చెప్పాపెట్టకుండా అంజలి ఎక్కడికో వెళ్లిందో, ఎక్కడ ఉందో తెలియని అయోమయ పరిస్థితి ఉంది. తాను క్షేమంగా ఉన్నట్లు తల్లికి అంజలి ఫోన్ చేసి చెప్పినట్లు ఆమె సోదరుడు రవిశంకర్ చెబుతున్నాడు.

అంజలి అదృశ్యం వెనుక ఆమె వ్యక్తిగత వైద్యుడి హస్తం ఉన్నట్లు, అతడితో ప్రేమ వ్యవహారం సాగిస్తున్నట్లు తెలుస్తుంది.చెన్నైలో అంజలి పిన్ని భారతీదేవి అంజలి క్షేమంగానే ఉందని తెలుసుకొని ఊపిరిపీల్చుకున్నట్లు చెప్పింది. అయితే అంజిలి గత కొద్దికాలంగా ఓ వ్యాధితో బాధపడుతుందని దానికోసం నిత్యం మాత్రలు మింగాల్సిన పరిస్థితి అంజలికి వచ్చిందని తెలిపింది. ఈ నేపథ్యంలో ఆమె ప్రత్యేక వైద్యుడితో ప్రేమలో పడి ఉండొచ్చని భారతీదేవి అంటోది.

అంజలి బెంగళూర్‌లో ఉన్నట్లు భావిస్తున్నారు. కానీ, అది కూడా అనుమానంగానే ఉన్నట్లు కనిపిస్తోంది. అంజలి బుధవారం బెంగుళూర్‌లో బోల్ బచ్చన్ రీమేక్ చిత్రీకరణలో పాల్గొంటుందని అందరూ భావించారు. కానీ, ఆ సినిమా షూటింగుకు రాలేదని, ఫోన్‌కు అందుబాటులో లేదని చిత్ర నిర్మాత స్రవంతి కిశోర్ చెప్పినట్లు ఆ ప్రముఖ తెలుగు దినపత్రిక రాసింది.

సోమవారం నుంచీ అంజలి ఫోన్ నుంచి వెళ్లిన ఫోన్ కాల్స్‌ను పరిశీలిస్తే సునీల్ సాల్మన్ అనే వ్యక్తికి ఎక్కువ ఫోన్ కాల్స్ వెళ్లినట్లు తెలిసిందంటూ వార్తలు వచ్చాయి. అతను తమ కుటుంబానికి తెలుసునని, ఆయన ఓ వైద్యుడని అంజలి పిన్ని భారతీదేవి చెప్పినట్లు కూడా వార్తలు వచ్చాయి. చెన్నైకి చెందిన సునీల్ అమెరికాలో ఉంటాడని చెబుతున్నారు.

English summary
According to media reports - actress Anjali is in love with a doctor. her aunt Bharatidevi confirmed it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X