వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హీరో కళ్యాణ్‌రామ్‌కీ బాలకృష్ణ దూరమే?

By Pratap
|
Google Oneindia TeluguNews

Kalyan Ram - Balakrishna
హైదరాబాద్: నందమూరి హీరో కళ్యాణ్ రామ్‌ను కూడా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ఆయన వియ్యంకుడు బాలకృష్ణ దూరం పెడుతున్నట్లు ప్రచారం సాగుతోంది. రాజ్యసభ సభ్యుడదు నందమూరి హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌లతో విభేదాల కారణంగా కళ్యాణ్ రామ్‌ను కూడా దూరం పెట్టాలనే నిర్ణయానికి చంద్రబాబు వచ్చినట్లు చెబుతున్నారు. హరికృష్ణ విభేదిస్తున్న సమయంలో కూడా కళ్యాణ్ రామ్ విశాఖపట్నంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు చంద్రబాబును పరామర్శించారు. అయినా, ఆయన కళ్యాణ్ రామ్‌ను దగ్గరకు తీసుకోవడం లేదని అంటున్నారు.

చంద్రబాబు కారణంగానే బాలకృష్ణ కూడా కళ్యాణ్‌రామ్‌ను పట్టించుకోవడం లేదని అంటున్నారు. పట్టించుకున్నా పట్టించుకోకున్నా ఫరవాలేదన్నట్లు తారకరత్న మాత్రం తెలుగుదేశం పార్టీ మహానాడుకు హాజరయ్యారు. నిజానికి, కళ్యాణ్‌రామ్‌కు బాబాయ్ బాలకృష్ణ అంటే తెగ ఇష్టమట. కానీ, బాలకృష్ణ మాత్రం తాజా వివాదం నేపథ్యంలో హరికృష్ణ పెద్ద కుమారుడైన కళ్యాణ్ రామ్‌ను కూడా పక్కన పెడుతున్నట్లు ప్రచారం సాగుతోంది.

ఇటీవలి కళ్యాణ్ రామ్ సినిమా ఆడియో విడుదల కార్యక్రమానికి నందమూరి కుటుంబం నుంచి ఎవరూ హాజరు కాలేదు. జూనియర్ ఎన్టీఆర్ కూడా హాజరు కాలేదు. అయితే, ఈ కార్యక్రమానికి ఎవరిని పిలిచారో, ఎవరిని పిలువలేదో తెలియదు గానీ మొత్తంగా కళ్యాణ్ రామ్ కార్యక్రమానికి వారు హాజరు కాకపోవడం చర్చనీయాంశంగానే మారింది.

చంద్రబాబు నాయుడు బాలకృష్ణతో మాత్రమే సన్నిహితంగా ఉంటూ హరికృష్ణ కుటుంబాన్ని దూరం పెడుతున్నారనే మాట వినిపిస్తోంది. అందుకే, కళ్యాణ్ రామ్ కలిసిపోవడానికి ఇష్టపడుతున్నా చంద్రబాబు నాయుడు గానీ బాలకృష్ణ గానీ స్వీకరించడానికి సిద్ధంగా లేరని అంటున్నారు. ఏమైనా, నందమూరి కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఎక్కువే ఉన్నట్లు చెవులు కొరుక్కుంటున్నారు.

English summary

 it is said that the Telugudesam party president Nara Chandrababu naidu and Nandamuri hero Balakrishna are keeping away from Nandamuri Harikrishna's son Kalyanram.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X