వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బుకీల కోడ్: ధోనీ హెలికాప్టర్, శ్రీశాంత్ రోత్రు

By Pratap
|
Google Oneindia TeluguNews

Sreesanth
ముంబై: బుకీలు, అండర్ వరల్డ్ కాంటాక్ట్స్ క్రికెట్ ఆటగాళ్లకు కోడ్ నేమ్స్ ఇచ్చుకున్నారట. ఆటగాళ్లను ప్రస్తావించాల్సి వచ్చినప్పుడు ఆ కోడ్ నేమ్స్‌నే వాడుతూ వస్తున్నట్లు పోలీసులు కనుక్కున్నారని తెలుస్తోంది. తమ ఫోన్లు ట్యాపైనా సరే, క్రికెటర్లను భద్రతా బలగాలు గుర్తించకుండా ఉండడానికి బుకీలు ఈ కోడ్ నేమ్స్ ఇచ్చుకున్నట్లు చెబుతున్నారు.

విందూ దారా సింగ్ సహాయంతో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కొందరు క్రికెటర్ల కోడ్ నేమ్‌లను డీకోడ్ చేసినట్లు చెబుతున్నారు. క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో బాలీవుడ్ నటుడు విందూ దారా సింగ్‌ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. విందూను జాక్ అనే పిలిచేవారట. శ్రీశాంత్‌ను రోత్రు అని, గురునాథ్ మేయప్పన్‌ను గురు అని సంబోధించేవారని తెలుస్తోంది.

బుకీల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న డైరీల్లో, ఐప్యాడ్స్‌లో ఈ కోడ్ నేమ్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ట్రాప్ చేసిన బుకీల సంభాషణల్లో కూడా ఈ పేర్లు దొర్లాయట. బుకీలు, అండర్ వరల్డ్ సభ్యులు నిక్ నేమ్స్ వాడడం సర్వసాధారణమేనని పోలీసులు అంటున్నారు.

రాడియా టేపుల కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో టేప్ చేసిన సంభాషణలపై పోలీసులు పెదవి విప్పడం లేదు. భారత కెప్టెన్‌కు హెలికాప్టర్ అని పేరు పెడితే, వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్‌కు రావణ్ అని పేరు పెట్టారట. లసతి మలింగకు మక్కీ అని, యువరాజ్ సింగ్‌కు మోడల్ అని పేర్లు పెట్టారని తెలుస్తోంది. బుకీలకు, మోడల్స్‌కు మాత్రమే కాకుండా ఇతరులకు కూడా కోడ్ నేమ్స్ ఇచ్చారట.

English summary
Police investigators trying to piece together the IPL betting jigsaw have found that the bookies and their underworld contacts used codenames to refer to each other as well as cricketers to avoid detection by security agencies who could be tapping their phones.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X