వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిరణ్, జగన్‌పై బొత్స 'బొబ్బిలి' యుద్ధం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana
ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఉప ఎన్నికల కోసం కాచుక్కూర్చున్నారట. ఇటీవల జరిగిన అవిశ్వాస తీర్మానంలో తొమ్మిది మంది కాంగ్రెసు ఎమ్మెల్యేలు, ఆరుగురు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు గీత దాటారు. గీత దాటిన కాంగ్రెసు ఎమ్మెల్యేలపై సాధ్యమైనంత త్వరగా వేటు వేసి ఉప ఎన్నికలు వెళ్లాలనే తహతహలో బొత్స ఉన్నారట. అందుకు ఆయన ప్రణాళిక ఆయనకు ఉన్నదట.

అవిశ్వాస తీర్మానం సమయంలో గీత దాటిన ఎమ్మెల్యేల్లో బొత్స జిల్లా విజయనగరంకు చెందిన బొబ్బిలి నియోజకవర్గ శాసనసభ్యుడు సుజయ కృష్ణ రంగారావు ఉన్నారు. జిల్లాలో బొత్సకు మంచి పట్టు ఉంది. ఉప ఎన్నికలు వస్తే బొబ్బిలి నియోజకవర్గంలో తన అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలుపించుకొని అధిష్టానం వద్ద మార్కులు కొట్టేయాలనే ఉద్దేశ్యంతో బొత్స ఉన్నారట.

గీత దాటిన ఎమ్మెల్యేలపై సాధ్యమైనంత త్వరగా వేటు వేసి ఉప ఎన్నికలు జరగాలని బొత్స గట్టిగా భావిస్తున్నారట. అందుకు కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం సిద్ధంగా లేరంటున్నారు. మరో రెండు నెలలు ఓపిక పడితే గీత దాటిన ఎమ్మెల్యేలపై వేటు వేసినా ఉప ఎన్నికలు రావు. అందుకోసం కిరణ్ యత్నిస్తున్నారట. కానీ బొత్స ఆలోచన మాత్రం అందుకు భిన్నంగా ఉంది. గతంలో జరిగిన తిరుపతి ఉప ఎన్నికల్లో కిరణ్ కాంగ్రెసు అభ్యర్థిని గెలిపించుకోలేకపోయారు.

తిరుపతి కిరణ్ జిల్లా చిత్తూరులోనే ఉంది. సొంత జిల్లాలోనే కిరణ్ కాంగ్రెసు అభ్యర్థిని గెలిపించుకోలేక పోవడంపై అధిష్టానం అసంతృప్తిని వ్యక్తం చేసింది. అయితే, ఇప్పుడు బొబ్బిలిలో ఉప ఎన్నిక జరిగితే కాంగ్రెసు అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించి తద్వారా అధిష్టానం వద్ద మార్కులు కొట్టేసే ఆలోచనలో బొత్స ఉన్నారంటున్నారు.

English summary

 It is said that PCC president Botsa Satyanarayana is inviting bypolls by taking action against YSR Congress president YS Jagan camp MLAs to create trouble to CM Kiran kumar Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X