వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టెండూల్కర్ సిక్స్‌లు, సెహ్వాగ్‌కు థ్యాంక్స్

By Pratap
|
Google Oneindia TeluguNews

చెన్నై: సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్ కోసం చెన్నై క్రికెట్ అభిమానులు ఎదురు చూశారు. రెండోసారి సచిన్ బ్యాటింగ్ చూడడానికి అవకాశం వస్తుందా, లేదా అనే సందేహంలో పడిపోయారు. ఈ స్థితిలో వీరేంద్ర సెహ్వాగ్ అవుట్ కావడంతో వారి నిరీక్షణ ఫలించింది. అందుకు వీరేంద్ర సెహ్వాగ్‌కు క్రికెట్ అభిమానులు థ్యాంక్స్ చెప్పే ఉంటారు.

తమ జట్టు క్రికెటర్ పెవిలియన్ దారి పడితే హర్షించిన సందర్భం ఇక్కడ కనిపించింది. టెండూల్కర్ బ్యాటింగ్‌కు వస్తాడనే ఉత్సుకతతో ఆ పని చేశారు. సచిన్ టెండూల్కర్ రావడం రావడమే రెండు సిక్స్‌లు బాది ప్రేక్షకులను అలరించాడు. తన 195 టెస్టు మ్యాచుల కెరీర్‌లో సచిన్ టెండూల్కర్ సిక్స్‌తో ఇన్నింగ్సును ప్రారంభించడం ఇదే మొదటిసారి కావచ్చు.

టెండూల్కర్ రెండు సిక్స్‌లతో భారత్ విజయానికి అతి చేరువగా వచ్చింది. రెండు పరుగులు చేస్తే విజయం హస్తగతం అవుతుంది. టెండూల్కర్ సింగిల్ తీసి స్కోరును సమం చేశాడు. టెండూల్కర్ విన్నింగ్ షాట్ కొడతాడని ఆశించి, ప్రేక్షకులు హర్షాతిరేకాలు చేస్తూ వెళ్లారు. కానీ టెండూల్కర్ అ పని చేయలేదు. తర్వాతి ఓవరులో ఛతేశ్వర్ పుజారా ఒక పరుగు తీయడంతో భారత్ విజయం దక్కించుకుంది.

Sachin Tendulkar

టెండూల్కర్ 10 బంతులు ఆడి 13 పరుగులు చేశాడు. టెండూల్కర్ పెవిలియన్ వెలుపల కాసేపు ప్యాడ్స్‌తో నించున్నాడు. భారీ స్క్రీన్లు అతన్ని చూపించాయి. దీంతో అభిమానులు కేరింతలు కొట్టారు. కొద్ది సేపు మాత్రమే ఆడిన టెండూల్కర్‌ను క్రికెట్ అభిమానులు మైదానంలోనూ, టీవీల ద్వారా చూశారు.

English summary
A smallish crowd at the MA Chidambaram Stadium waited, waited and waited for that moment to arrive. It was not about India's victory on Tuesday but a man batting who has enthralled them over the years - Sachin Tendulkar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X