వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్రిస్ గేల్ మాట: సీన్ రివర్స్ అయితే...

By Pratap
|
Google Oneindia TeluguNews

Chris Gayle
బెంగళూర్: ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించే రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ తన మనసులోని మాట చెప్పాడు. ప్రత్యర్థి బౌలర్లను చితకబాదుతున్నప్పుడు తనకు తెగ ఆనందం వేస్తుందని, అయితే అదే స్థాయిలో అవతలి బ్యాట్స్‌మెన్ చెలరేగితే బాధ కలుగుతుందని అన్నాడు. తమ జట్టుపై మిల్లర్ చేలరేగి ఆడిన సంఘటనపై ఆయన ఆ విధంగా అన్నాడు. మిల్లర్ బెంగళూర్ జట్టుపై 38 బంతుల్లో సెంచరీ చేసిన విషయం తెలిసిందే.

అదో బాధాకరమైన విషయమని, మన చేదు మందును మనమే రుచి చూడాల్సి రావడం ఎంత మాత్రం రుచించిదని ఆయన అన్నాడు. తాను ఎంతో మంది బౌలర్లను బాధించానని, కానీ ఆ మ్యాచులో మిల్లర్ చితకబాదుతున్నప్పుడు ఓ బౌలర్ బౌలింగ్‌ను ఊచకోత కోస్తుంటే ఎలా ఉంటుందో చూడ అన్నట్లు తనకు తాను చెప్పుకున్నానని అన్నాడు. ఆ ఇన్నింగ్సును చూస్తుంటే తనను తాను అద్దంలో చూసుకున్నట్లుందని గేల్ వ్యాఖ్యానించాడు.

డేవిడ్ మిల్లర్‌కు క్లూసెనర్ మంత్రోపదేశం..

తాను ఐపియల్‌లో రాణించడం దక్షిణాఫ్రికా మాజీ ఆల్ రౌండర్ లాన్స్ క్లూసెనర్ పుణ్యమని డేవిడ్ మిల్లర్ చెప్పాడు. గత సీజన్ నుంచి క్లూసెనర్ వద్ద తాను శిక్షణ తీసుకుంటున్నానని, అది తన అదృష్టమని ఆయన అన్నాడు. మ్యాచులను ముగించడంపై క్లూసెనర్ ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చినట్లు తెలిపాడు.

ఒత్తిడిలో ప్రశాంతంగా ఉండడం నేర్చుకున్నానని, ఆరు ఓవర్లలో 60 పరుగులు చేయాలని ఆలోచించడం కన్నా 36 బంతుల్లో 60 పరుగులు చేయాలని అఅనుకుంటే సులభంగా ఉంటుందని మిల్లర్ అన్నాడు.

English summary

 The Royal Challerngers Bangalore batsmen Chris Gayle said that it is very painful when rival batsman plays his bowling with effotless.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X