వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'మరీ ఓవరైంది!: ఢిల్లీలో కిరణ్‌కు అంత సీన్ లేదు'

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
మీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మరీ ఎక్కువగా మాట్లాడుతున్నారని, అధిష్టానం వద్ద ఆయన ప్రాముఖ్యం తగ్గిందని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ వ్యాఖ్యానించారట. నాలుగు రోజుల క్రితం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ తెలంగాణపై జివోఎం ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశంలో పాల్గొన్న విషయం తెలిసిందే.

ఈ సమయంలో జివోఎం మంత్రులు, సిపిఐ నేతల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ఓ సమయంలో నారాయణతో ఆజాద్ మాట్లాడుతూ... 'మీ ముఖ్యమంత్రి చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. హైకమాండ్ వద్ద ఆయన ప్రాధాన్యం తగ్గింది' అని చెప్పారు.

గత కొంతకాలంగా అధిష్టానం ముఖ్యమంత్రి తీరు పైన అసంతృప్తితో ఉన్నట్లుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కిరణ్ పైన సిపిఐ నేతలతో ఆజాద్ చేసిన వ్యాఖ్యలు గమనార్హం. కిరణ్‌ను అధిష్టానం మార్చుతుందని చాలా రోజుల నుండి జోరుగా ప్రచారం సాగుతోంది.

ఇలాంటి సమయంలో అధిష్టానం నాలుగు నెలల క్రితం సిడబ్ల్యూసి తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. అప్పటి నుండి కిరణ్ సమైక్యవాదాన్ని బలంగా వినిపిస్తున్నారు. ఢిల్లీ పెద్దలను సవాల్ చేస్తున్నారు. కిరణ్ తీరు పైన ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా అసహనం, ఆగ్రహంగా ఉన్నారట. తాజా ఆజాద్ వ్యాఖ్యలు అధిష్టానం ముఖ్యమంత్రి పైన ఎంత ఆగ్రహంతో ఉందో అర్థమవుతోందంటున్నారు.

English summary
The Congress high command is very particular that they don't want to succumb to blackmail of CM Kiran Kumar Reddy and Seemandhra lobby again and again.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X