• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వైయస్ నీడ సూరీడుపై దాసరి సినిమా?

By Pratap
|
 sureedu
హైదరాబాద్: దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డికి ఆత్మ కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావు కాగా, నీడ సూర్యనారాయణ రెడ్డి అలియాస్ సూరీడు. వైయస్ రాజశేఖర రెడ్డికి జీవితం కాలంపాటు సూరీడు సేవలు చేస్తూ ఉండిపోయాడు. వైయస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సూరీడు వ్యక్తిగత సహాయకుడిగా పనిచేశారు. తద్వారా సూరీడు వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో అత్యంత ప్రముఖ వ్యక్తిగా పేరు గాంచాడు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో సూరీడు సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలం అత్యంత కీలకమైందని భావిస్తున్నారు. అది ఓ వైపు అయితే, మరో వైపు ఉంది. ప్రముఖ దర్శక నిర్మాత దాసరి నారాయణ రావు సూరీడు ఉదంతాన్ని ఇతివృత్తంగా తీసుకుని ఓ సినిమా నిర్మించినట్లు చెబుతున్నారు.

నిజానికి, ఉప ఎన్నికలకు ముందు దాసరి నారాయణ రావు అసెంబ్లీలో దొంగలు పడ్డారు అనే టైటిల్‌తో సినిమాను నిర్మించడానికి ప్రయత్నించారు. దాన్ని ఉప ఎన్నికలకు ముండు విడుదల చేయాలని అనుకున్నారట. కానీ, ఉప ఎన్నికలు ముందుగానే రావడంతో ఆ ప్రయత్నాలు వెనక్కి పోయినట్లు చెబుతున్నారు.

తాజాగా, ఆయన వడ్డీకాసుల వాడు పేరుతో సినిమా తీయాలని ప్లాన్ వేస్కున్నట్లు చెబుతున్నారు. ఆ సినిమా షూటింగ్ దాసరి నారాయణ రావు జన్మదినం మే 4వ తేదీన ప్రారంభమవుతుందని అంటున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆ సినిమాను విడుదల చేయాలని దాసరి నారాయణ రావు అనుకుంటున్నారట. రాజకీయాల పట్ల స్పష్టమైన అవగాహన కలిగిన దాసరి నారాయణ రావు ఆ సినిమాను ఎటు వైపు నడిపిస్తారో చూడాలనే ఆసక్తి కలగడం సహజమే..

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
It is said that Dasari Narayan Rao is preparing a story which speaks about a peon in Secretariat but cine circles say this is the story of Sureedu only.
Get Instant News Updates
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more