వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రెండ్ సెట్టర్: ధోనీ వింత హెయిర్ స్టయిల్

By Pratap
|
Google Oneindia TeluguNews

రాంచీ: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ హెయిర్ స్టయిల్ మరోసారి చర్చనీయాంశంగా మారింది. దక్షిణాఫ్రికాకు చెందిన టైటాన్స్‌తో ఆదివారం జరిగిన చాంపియన్స్ లీగ్ ట్వంటీ20 మ్యాచులో కొత్త హెయిర్ స్టయిల్‌తో మైదానంలోకి దిగాడు. ఆట కన్నా ఎక్కువగా అదే చర్చనీయాంశంగా మారింది.

గేమ్‌ప్లాన్లను మార్చేసినట్లే హెయిర్ స్టయిళ్లనూ ధోనీ మార్చేస్తాడని అంటారు. అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇస్తూనే తన జులపాల జట్టుతో అందరి దృష్టినీ ఆకర్షించాడు. 2006లో ధోనీ హెయిర్ స్టయిల్‌కు పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కూడా ఫిదా అయ్యాడు.

Dhoni's new hairstyle talk of the town

ధోనీ ఈసారి కొత్త హెయిర్ స్టయిల్‌తో మైదానంలోకి అడుగు పెట్టాడు. ప్రస్తుత ధోనీ హెయిర్ స్టయిల్‌ను బాల్డ్ బజ్ కట్ అంటారట! ఇటలీ ఫుట్‌బాల్ స్టార్ మారియో బలోటెల్లి మాదిరిగా తల వెనుక భాగాన ఇరు వైపులా వెంట్రుకలను కత్తిరించుకుని మధ్య భాగంలో మాత్రం ఇలా సన్నగా వదిలేశాడు.

శనివారం దాకా పాత హెయిర్ స్టయిల్‌తోనే దర్శనమిచ్చిన ధోనీ ఆదివారం ఆటలోకి అడ్డుగు పెట్టే సరికి మార్చేశాడు. ఆదివారం ఉదయమే అతను తన హెయిర్ స్టయిల్‌ను మార్చేసినట్లు అర్థమవుతోంది. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ధోనీ హెయిర్ స్టయిల్ ఇప్పుడు ట్రెండ్ సెట్ చేస్తుందా చూడాలి.

English summary
Chennai Super Kings skipper M.S. Dhoni sported a new hairstyle as he made his way into the game against South African side Titans here on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X