వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గురునాథ్‌పై మాట మార్చిన హస్సీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Michael Hussey
న్యూఢిల్లీ: బిసిసిఐ అధ్యక్షుడు ఎన్ శ్రీనివాసన్ అల్లుడు గురునాథ్ మేయప్పన్‌పై చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆటగాడు మైకెల్ హస్సీ మాట మార్చాడు. తన ఆత్మకథలో తప్పుగా రాసి ఉంటానని అంటూ అతను యూ టర్న్ తీసుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్‌పై నియంత్రణను శ్రీనివాసన్ తన అల్లుడు గురునాథ్ మేయప్పన్‌కు అప్పగించాడంటూ హస్సీ తన ఆత్మకథలో అన్నాడు. అది వివాదానికి దారి తీసింది.

బెట్టింగ్ వ్యవహారంలో గురునాథ్ మేయప్పన్ అరెస్టయిన నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ వివాదంలో పడింది. దీంతో గురునాథ్ చెన్నై సూపర్ కింగ్స్‌తో సంబంధం లేదంటూ జట్టు యాజమాన్యం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన వెలువడిన తర్వాత హస్సీ ఆత్మకథలో వ్యాఖ్యలు వెలుగు చూశాయి.

జట్టు గురునాథ్ పాత్ర ఏమిటో తనకు స్పష్టం తెలియదని హస్సీ అన్నాడు. గురునాథ్ సూపర్ కింగ్స్ కోచ్ కెప్లెర్ వెసెల్స్‌తో, ఆటగాళ్లతో మాట్లాడుతూ ఉండేవాడని, శిక్షణా శిబిరంలోనూ హోటల్లోనూ కనిపిస్తూ ఉండేవాడని, అయితే గురునాథ్‌కు ఏ విధమై అధికారం అప్పగించారో తనకు తెలియదని హస్సీ వివరణ ఇచ్చాడు.

తాను ఇండియా సిమెంట్స్ వైయస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ శ్రీనివాసన్‌ను కలిసి క్షమాపణలు కోరినట్లు ఆయన తెలిపారు. ఆందోళన వద్దని, అంతా బాగానే ఉందని శ్రీనివాసన్ తనతో అన్నట్లు కూడా ఆయన తెలిపాడు.

English summary

 Just days after claiming that Gurunath Meiyappan , who was arrested for his alleged role in the IPL spot-fixing and betting scandal, was actually running the Chennai Super Kings team, Michael Hussey on Monday (October 14) made a U-turn, saying that he might have written wrongly in his autobiography.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X