• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వైరాగ్యంలో శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా

By Pratap
|

Raj kundra
న్యూఢిల్లీ: ఎంతవారలైనా వేదాంతులే అనే విషయాన్ని బాలీవుడ్ నటి, రాజస్థాన్ రాయల్స్ సహ యజమాని శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా నిరూపిస్తున్నారు. ఐపియల్ బెట్టింగ్ చిక్కుల్లో ఇరుక్కున్న రాజ్ కుంద్రా ఇప్పుడు వేదాంతం వల్లిస్తున్నాడు. రాజస్థాన్ రాయల్స్ నుంచి అతను ఉద్వాసనకు కూడా గురయ్యాడు.

చిక్కులు చుట్టుముట్టడంతో జీవితంమీద వైరాగ్యం పుట్టుకొచ్చిందో లేక జీవిత పరమార్థం తెలిసి వచ్చిందో తెలియదు గానీ ఉన్నట్టుండి వేదాంతం మాట్లాడుతున్నాడు. బుధవారం అతను ట్విట్టర్‌లో చేసిన ట్వీట్‌లను గమనిస్తే అలాంటి అభిప్రాయమే కలుగుతుంది.

'జరిగేది జరుగుతుంది. దాన్ని మనం మార్చలేం. అలాగని పోరాడకుండా వదిలేస్తే ఏ సమస్యకూ పరిష్కారం దక్కదు' అంటూ ట్వీట్ చేసి తన వైరాగ్యాన్ని వెల్లబోసుకున్నాడు. అయితే, కుంద్రాకు రెండు రకాల ఊరట లభిస్తోంది.

కుంద్రా బెట్టింగుకు మాత్రమే పాల్పడ్డాడని, అతనికి స్పాట్ ఫిక్సింగ్‌తో సంబంధం లేదని ఢిల్లీ పోలీసులు ప్రకటించడం ఒక ఊరట కాగా, అతని వ్యాపార భాగస్వామి ఉమేష్ గోయంకా మాట మార్చడం మరో ఊరట. కుంద్రా పేరు తన నోటి వెంట రాబట్టడానికి ఢిల్లీ పోలీసులు తనను వేధించారని ఉమేష్ గోయంకా అన్నారు. దీంతో కేసు తీరుతెన్నులు మారిపోయే పరిస్థితి వచ్చింది. ఏమైనా, కుంద్రా బయటపడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.

English summary
IPL Rajasthan Royals franchise co owner and Bollywood actress Shilpa Shetty's husband Raj Kundra seems to be stoic due to betting allegations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X