కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్‌లాగేనా?: రవీంద్రనాథ్‌కు రాచమర్యాద!

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan - Ravindranath Reddy
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి మేనమామ, కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్ రెడ్డిని జైలుకు తరలించడంపై వివాదం చెలరేగింది. ఫోర్జరీ, చీటింగ్ కేసులో రవీంద్రనాథ్ రెడ్డి మంగళవారం ఉదయం కడప కోర్టులో లొంగిపోవడంతో అతనికి మార్చి 11వ తేది వరకు రిమాండు విధించింది. అతనిని పోలీసులు కడప జైలుకు తరలించారు. సాధారణ ఖైదీ నుండి కీలక వ్యక్తుల వరకు అందర్నీ పోలీసు వాహనంలోనే తరలించాల్సి ఉంటుంది.

కానీ, రవీంద్రానాథ్ రెడ్డిని మాత్రం పోలీసులు ఎసి కారులో జైలుకు తరలించారు. భద్రతాపరమైన ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అంటే ఆయన ప్రస్తుతం ఏ పదవిలో లేరు. అలాంటప్పుడు అందరికీ భిన్నంగా ఎసి కారులో ఎలా తరలిస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. రవీంద్రనాథ్ రెడ్డికి కడప పోలీసులు రాచమర్యాదలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. కడప సెంట్రల్ జైలులో రవీంద్రనాథ్ రెడ్డికి అధికారులు రిమాండ్ ఖైదీ నెంబర్ 1897 కేటాయించారు.

అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి కూడా జైలులో మిగతా ఖైదీల కంటే భిన్నంగా మర్యాదలు జరుగుతున్నాయని టిడిపి నేతలు ఆరోపించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా జగన్‌కు ప్రభుత్వం సహకరిస్తుందని, ఆయనకు సకల సౌకర్యాలు కల్పిస్తోందని వారు ఆరోపించారు. దీనిపై వారు జైలు అధికారులకు లేఖలు కూడా రాశారు. అవసరమైతే కోర్టుకు కూడా వెళ్తామని చెప్పారు. తాజాగా, మేనమామను ఎసి కారులో తరలించారనే వార్తలు రావడం గమనార్హం.

ఫోర్జరీ కేసులో దాదాపు నెలరోజులుగా రవీంద్రనాథ్ రెడ్డి అజ్ఞాతంలో ఉన్నారు. ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేకుండా పోయింది. దీంతో అతను మంగళవారం లొంగిపోవడం, రిమాండుకు తరలించడం జరిగింది. రిమాండుకు తరలించిన అనంతరం కూడా ఆయన బెయిల్ పిటిషన్ దరఖాస్తు చేసుకున్నారు. దానిని కోర్టు తిరస్కరించింది. మరోవైపు పోలీసులు ఆయనను తమ కస్టడీకి అప్పగించాలని పిటిషన్ దాఖలు చేశారు.

బెయిల్ వస్తుందని ఆశించిన రవీంద్రనాథ్ రెడ్డికి రిమాండ్ తప్పక పోవడంతో ఆయనతో పాటు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శ్రేణులు నిరాశకు లోనయ్యారు. కోర్టుకు వచ్చినప్పటి నుంచి మాజీ మేయర్ ముఖ కవళికలు మారిపోయాయి. బెయిల్ రాకపోవడంతో నిరాశతో సెంట్రల్ జైలుకు వెళ్లారు. ఆయన అనుచరులు జైలు వరకు ఆయన వెంట వెళ్లారు.

English summary
Former mayor and brother of YSR Congress honorary president Vijayalakshmi, P. Ravindranath Reddy, surrendered before the Second Additional District Court here on Tuesday in connection with a bogus voters’ enrolment case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X