వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓటేయని కెసిఆర్: డికె అరుణ ఊళ్లో జగన్ పార్టీ

By Pratap
|
Google Oneindia TeluguNews

K chandrasekhar Rao
హైదరాబాద్: పంచాయతీ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు ఓటు వేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. తన స్వగ్రామమైన మెదక్ జిల్లా సిద్దిపేట మండలం చింతమడకలోని ఆరో వార్డులో ఆయనకు ఓటు హక్కు ఉంది. ఓటరు జాబితాలో 852 నెంబరు కెసిఆర్‌ది కాగా, 851 నెంబరుతో ఆయన భార్య శోభ పేరున్నది.

ఎస్సీ మహిళకు రిజర్వు అయిన ఈ గ్రామ సర్పంచ్ స్థానం కోసం తెరాసకు చెందిన ఎర్రోల లక్ష్మి, చెప్యాల దేవమ్మలు పోటీ పడ్డారు. మరే పార్టీ మద్దతుదారులెవరూ పోటీ చేయలేదు. తొలివిడతగా మంగళవారం ఈ గ్రామానికి జరిగిన ఎన్నికలలో కెసిఆర్, ఆయన భార్య ఓటు హక్కును వినియోగించుకోలేదని వార్తలు వచ్చాయి.

జిల్లాలోని జగదేవపూర్ శివారులోని ఫాంహౌస్‌లోనే కెసిఆర్ ఉన్నారు. కానీ ఓటు వేయడానికి రాలేదు. అయితే తన సొంత జిల్లా మెదక్‌లో మాత్రం కెసిఆర్ పార్టీ అత్యధిక సర్పంచ్ పదవులను దక్కించుకుంది.

కాగా, మంత్రి డికె అరుణ స్వగ్రామం ధర్మారం పంచాయతీలో కాంగ్రెస్ మద్దతుదారుడు ఓటమిపాలయ్యాడు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి గెలుపొందాడు. ఆ గ్రామం మహబూబ్‌నగర్ జిల్లాలో ఉంది. మహబూబ్‌నగర్ జిల్లాలో కాంగ్రెసు సత్తా చాటినప్పటికీ మంత్రిగారి ఊళ్లో ఎదురుదెబ్బ తగలడం హాట్ టాపిక్‌గానే మారింది.

English summary
The Telangana Rastra Samithi (TRS) president K chandrasekhar Rao has not cast his vote in village in Medak district in Panchayat elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X