వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జైల్లో లాలూకు భగవద్గీత: కేబుల్ టీవి కోరిక

By Pratap
|
Google Oneindia TeluguNews

Lalu Prasad Yadav
పాట్నా: రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ చేతికి భగవద్గీత వచ్చింది. దాణా కుంభకోణంలో దోషిగా తేలిన ఆయన ప్రస్తుతం ఖైదీ నెంబర్ 3312గా రాంచీలోని బిర్సా ముండా కేంద్ర కారాగారంలో ఉన్నారు. పార్టీ సహచరుడు, పార్లమెంటు సభ్యుడు రఘువంశ్ ప్రసాద్ సింగ్ లాలూ ప్రసాద్ యాదవ్ చేతిలో భగవద్గీత పెట్టారు. అంతేకాకుండా జైలు జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉపదేశం కూడా చేశారట.

అప్పర్ డివిజన్ బ్లాక్‌లో వివిఐపి గదిని కేటాయించినప్పటికీ జైలు రాత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కనాకష్టంగా గడిపారట. సోమవారం ఆయనను రాంచీ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. బెయిల్ లభించే వరకు మూడేళ్లకు పైగా జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధు కోడా అదే బ్లాక్‌లో ఉన్నారు.

లాలూ ప్రసాద్ యాదవ్ గదిలో ఉన్న టెలివిజన్ సెట్‌కు కేబుల్ కనెక్షన్ లేదు. దీంతో ఆయన కేబుల్ కనెక్షన్ కోసం విజ్ఞప్తి చేశారని తెలుస్తోంది. కేబుల్ కనెక్షన్ కోసం లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన విజ్ఞప్తిని రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్లు జైళ్ల శాఖ జార్ఖండ్ ఐడిపి శైలేంద్ర భూషణ్ చెప్పారు.

బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన 25 మంది సీనియర్ నాయకులు లాలూ ప్రసాద్ యాదవ్‌ను జైలులో కలిసి సంఘీభావం తెలిపారు. తాను లాలూకు భగవద్గీత ఇచ్చి, అందులోని గొప్ప శ్లాకాలను చదవాలని సూచించినట్లు వైశాలీ ఎంపి రఘువంశ్ ప్రసాద్ చెప్పారు. అంతేకాకుండా ప్రతి రోజూ ఉదయం కనీసం గంటపాటు మార్నింగ్ వాక్ చేయాలని తాను సలహా ఇచ్చినట్లు ఆయన తెలిపారు.

English summary
RJD chief Lalu Prasad Yadav, Prisoner No. 3312 at Birsa Munda Central Jail in Ranchi, was on Tuesday given a copy of the Gita by top party colleague and fellow MP Raghuvansh Prasad Singh, along with some practical advice on making good use of jail time.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X