వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

...బ్యాచ్‌లర్ మోడీకి కాంట్రవర్సీ సెక్సీ క్వీన్ విషెస్

By Srinivas
|
Google Oneindia TeluguNews

 Mallika sings Happy Birthday for Modi
అహ్మదాబాద్: గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీని మోస్ట్ ఎలిజబుల్ బ్యాచులర్‌గా ఇటీవల పేర్కొన్న గ్లామర్ అండ్ కాంట్రవర్సీ క్వీన్ మల్లికా శెరావత్ తాజాగా ఆయనకు పుట్టిన రోజున శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం మోడీ 63న జన్మదినం.

ఈ సందర్భంగా ఆమె మోడీకి శుభాకాంక్షలు చెబుతూ పుట్టిన రోజు గీతాన్ని పాడారు. దానిని ఆమె నెట్‌లో పెట్టారు. పుట్టిన రోజు గీతం పాడటానికి ముందు ఆమె... అత్యంత అర్హుడైన బ్రహ్మచారి అయిన మోడీకి తాను పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటున్నానని పేర్కొన్నారు.

అనంతరం బర్త్ డే సాంగ్ పాడారు. 'హ్యాపీ బర్త్ డే టు యు. హ్యాపీ బర్త్ డే నరేంద్రజీ. హ్యాపీ బర్త్ డే నరేంద్ర మోడీజీ. హ్యాపీ బర్త్ డే నరేంద్రజీ' అంటూ పుట్టిన రోజు పాటను పాడి విడుదల చేశారు. ఇది అందర్నీ అకట్టుకుంటోంది. దీనిని చాలామంది నెట్లో చూస్తున్నారు.

English summary
Mallika Sherawat recently said Narendra Modi was India's most eligible bachelor. On the BJP PM candidate's birth day on Tuesday, the actress took her admiration for the leader a step forward.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X