వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్రికెట్‌లో హీరో: కెప్టెన్ ధోనీ మొద్దబ్బాయే

By Pratap
|
Google Oneindia TeluguNews

Mahendra Singh Dhoni
రాంచీ: మన క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ క్రికెట్‌లో హీరోనే. కానీ చదవులు మాత్రం జీరోగా మిగిలిపోతున్నాడు. జార్ఖండ్ డైనమైట్‌గా పేరు పొందిన అతను చదువులో మొద్దబ్బాయిగానే మిగిలిపోతున్నాడు. రాంచీకి చెందిన ఈ క్రికెటర్ తన పాఠశాల విద్యాభ్యాసాన్ని డీఏవీ స్కూల్‌లో పూర్తి చేసి, రాంచీలోని సెయింట్ జేవియర్ కాలేజీలో బ్యాచిలర్స్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ అండ్ సెక్రటేరియల్ ప్రాక్టీస్ కోర్సులో చేరాడు.

అయితే, తన క్రికెట్ బిజీ షెడ్యూల్ కారణంగా అతను విద్యాభ్యాసాన్ని పూర్తి చేయలేక పోయాడు. ఈ యేడాదితో ఆరు సెమిస్టర్లకు గాను ఐదు సెమిస్టర్లు పూర్తికానున్నాయి. కానీ ఒక్కటంటే ఒక్క సబ్జెక్టులో గట్టెక్కలేకపోయాడు.

ఆ రీతిలోనే అతడి తొలి సంవత్సరం అకాడమీ కెరీర్‌ ముగిసింది. భారత క్రికెట్‌ కెప్టెన్‌గా బిజీ షెడ్యూల్స్‌లో ఉండే ధోనీకి అంతకుముందు కళాశాల తమ నిబంధనల్లో కొన్ని మార్పులు చేసింది. అయినప్పటికీ ధోనీ వాటినంతగా ఉపయోగించుకున్నట్లు లేదు.

అయితే, అభిమానులకు ధోనీ చదువు ముఖ్యం కాదు, క్రికెట్‌లో అదరగొట్టడమే కావాల్సింది. చిన్న నగరాల నుంచి వచ్చే ప్రతిభావంతుల గురించి ధోనీ ఎప్పుడూ మాట్లాడుతుంటాడు. ఆ రకంగా అతని సామాజిక పరిశీలన మాత్రం పదునెక్కినట్లే కనిపిస్తోంది.

English summary
Team India captain MS Dhoni is not able to complete his studies. He is busy in Cricket schedules.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X