వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరు-జనాభా పెరుగుదల: ఉలిక్కిపడిన నాగబాబు!

By Srinivas
|
Google Oneindia TeluguNews

 Nagababu shocked by Dhanraj
భారతదేశంలో జనాభా పెరిగి పోవడానికి చిరంజీవి కూడా కారణమంటూ ఓ హాస్యనటుడు జబర్‌దస్త్ కార్యక్రమంలో చెప్పి చిరు సోదరుడు నాగబాబు ఉలిక్కిపడేలా చేశారు. ఈటివిలో ప్రతి గురువారం రాత్రి జబర్దస్త్ కార్యక్రమం వస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి నిర్మాత నాగబాబు, నటి రోజాలు న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు.

ఇటీవల జరిగిన ఈ ప్రోగ్రాంలో ధనరాజ్ మాట్లాడుతూ... జనాబాకు సంబంధించి చైనా తర్వాత స్థానంలో మన దేశం నూటా పది కోట్ల మందిని మించి దూసుకుపోతోందని, ఈ పెరుగుదలకు ఎన్నో కారణాలున్నా... చిరంజీవి కూడా ఓ కారణం అంటూ కామెంట్ చేశారు. దీంతో అక్కడే ఉన్న నాగబాబు షాక్ అయ్యారు.

అయితే అంతలోనే ధనరాజ్ తన కామెంట్‌కు తానే మరో రీతిగా సమాధానం చెబుతూ... చిరంజీవి బ్లడ్ బ్యాంకు వల్ల లక్షల మంది ప్రాణాలతో బయటపడుతున్నారంటూ వ్యాఖ్యానించారు. ధనరాజ్ కామెంట్, దానికి అతనే ఇచ్చిన సమాధానంతో నాగబాబు మనస్ఫూర్తిగా నవ్వేశారట.

కాగా, జబర్దస్త్ కార్యక్రమంలో న్యాయనిర్ణేతలుగా ఉన్న నాగబాబు, రోజాల పైన కూడా హాస్యనటులు సెటైర్స్ వేస్తూ అందర్నీ కడుపుబ్బా నవ్విస్తుంటారు. వారు జబర్దస్త్‌గా, తొణక్కుండా బెణక్కుండా సైటైర్లు, జోకులు విసురుతున్నారు. ప్రేక్షకులతో పాటు నాగబాబు, రోజాలు కూడా ఆ సెటైర్లను ఎంజాయ్ చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం రోజా మేకప్‌పై రెండు మూడు ఎపిసోడ్లలో విపరీతమైన సెటైర్లు కురిశాయి.

English summary
Producer Nagababu was shocked by Wellknown comedian Dhanraj's comments on Chiranjeevi in Jabardhasth programme.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X