వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జియా ఖాన్ బాయ్‌ఫ్రెండ్‌కి నాగార్జున హెల్ప్?

By Pratap
|
Google Oneindia TeluguNews

Nagarjuna's offer to Sooraj Pancholi
హైదరాబాద్: ఆత్మహత్యకు పాల్పడిన బాలీవుడ్ నటి జియా ఖాన్ ప్రియుడు సూరజ్ పంచోలీకి సినీ పరిశ్రమలో మంచి మిత్రులే ఉన్నట్లున్నారు. సూరజ్ పంచోలీకి జియా ఖాన్ విషయంలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ మంచి సలహా ఇచ్చినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు తెలుగు సినీ హీరో నాగార్జున విషయంలో కూడా వార్తలు వస్తున్నాయి.

సూరజ్ పంచోలీకి నాగార్జున తోడునీడగా ఉన్నట్లు హైదరాబాదుకు చెందిన ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక రాసింది. జియా ఖాన్ ఆకస్మిక మృతితో తీవ్ర మనస్తాపానికి, ఆందోళనకు గురైన సూరజ్ పంచోలీకి హైదరాబాద్‌కు చెందిన ఓ మంచి థెరపిస్టును నాగార్జున చూపించాడని పుకార్లు షికార్లు చేస్తున్నాయంటూ దక్కన్ క్రానికల్ పత్రిక రాసింది.

హైదరాబాదులో ఉన్నప్పుడు ఆ థెరపిస్టు తరుచుగా సూరజ్ పంచోలీని కలిసినట్లు ఆ పత్రిక రాసింది. అయితే ఆ విషయం నిర్ధారణ కాలేదని కూడా చెప్పింది. ఈ విషయంపై నాగార్జున మాట కోసం కూడా ఆ పత్రిక ప్రయత్నించింది. ఈ విషయం దక్కన్ క్రానికల్ స్వయంగా రాసుకుంది.

నాగార్జున అందుబాటులో లేరని, ఓ టెలివిజన్ కమర్షియల్ కోసం అమితాబ్ బచ్చన్‌తో షూటింగులో పాల్గొనడానికి ముంబై వెళ్లాడని దక్కన్ క్రానికల్ రాసింది. ఏమైనా, నిప్పు లేనిదే పొగ రాదు కదా అని సినీవర్గాలంటున్నాయి.

English summary

 According to Deccan Chronicle daily - Rumours in the city claim Nag offered to put Sooraj in touch with a very "smart" Hyderabad-based therapist, to help the latter get over the trauma he suffered due to the Jiah Khan scandal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X