వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'స్త్రీలోలుడు: నిత్యానంద, రంజిత వీడియోలు నిజమే'

By Pratap
|
Google Oneindia TeluguNews

Nithyananda followers says the videos are real
బెంగళూర్: వివాదాస్పద నిత్యానంద స్వామి స్త్రీలోలుడేనని అతని మాజీ శిష్యుడు లెనిన్ స్పష్టం చేశాడు. ఆదివారం బెంగళూరులో అతను మీడియా ప్రతినిధులతో మాట్లాడాడు. స్వామి నిత్యానంద, సినీ నటి రంజిత సెక్స్ వీడియోలు నిజమైనవేనని, వీటి నిర్ధారణకు సంబంధించి కర్ణాటక పోలీసులతోపాటు దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక ల్యాబ్‌లు రిపోర్టు ఇచ్చాయని చెప్పినట్టు లెనిన్ వివరించాడు.

బ్రాడ్‌కాస్టింగ్‌, కంటెంట్‌ కంప్లైంట్‌ కౌన్సిల్ తన వద్ద ఉన్న పూర్తి ఆధారాలను పరిశీలించాలని వెల్లడిచారు. నిత్యానంద స్త్రీలోలుడనేందుకు తానే సాక్షినని చెప్పాడు. ఆ వీడియోలు బయటపెట్టినందుకు తనపై కక్ష కట్టి అక్రమ కేసులతో నిత్యానంద వేధిస్తున్నాడని లెనిన్‌ ఆరోపించారు.

భక్తి పేరుతో మోసం చేస్తున్న నిత్యానందపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశాడు. నిత్యానందకు ప్రియ శిష్యుడిగా, డ్రైవర్‌గా పనిచేసిన లెనిన్‌ కరుప్పన్‌ గతంలో నిత్యానంద, రంజిత చనువుగా ఉన్న వీడియోలను బయటపెట్టి సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. వీటికి సంబంధించిన ఆధారాలను కర్ణాటక సీఐడీ విభాగానికి లెనిన్ సమర్పించాడు.

నిత్యానంద స్వామి, రంజితల సెక్స్ వీడియోల వ్యవహారం తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. నిత్యానంద కొన్నాళ్లు అజ్ఞాతంలోకి కూడా వెళ్లారు. తిరిగి ఇప్పుడు ఆ వీడియోల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.

English summary

 Former follower of self styled god man Swami Nithyananda, Lenin said that the videos of Ranjitha and Nithyananada are real.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X