వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'కిరణ్' లేకుంటే నేనే ముఖ్యమంత్రినన్న శంకరన్న

By Srinivas
|
Google Oneindia TeluguNews

Shankar Rao
సీల్డ్ కవర్‌లో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పేరు ఉండకపోయి ఉంటే తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిని అయ్యే వాడినని మాజీ మంత్రి, కంటోన్మెంట్ శాసన సభ్యుడు శంకర రావు గురువారం వ్యాఖ్యానించారు. ఆయన గురువారం విలేకరులతో హైదరాబాదులో మాట్లాడారు.

తెలంగాణను ఇస్తున్న ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి గుడి కడతానని, స్థలం ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్ అధిష్ఠానం పంపిన సీల్డ్ కవర్‌లో కిరణ్‌ కుమార్ రెడ్డి పేరు లేకపోయి ఉంటే, తాను ఆంధ్రప్రదేశ్‌కి ముఖ్యమంత్రినై ఉండేవాడినని చెప్పారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోకుండా, అధిష్ఠానం నిర్ణయాన్ని శిరసావహించాలని సిఎంను కోరారు.

వచ్చే నెల 9వ తేదీన సోనియా పుట్టిన రోజును పురస్కరించుకుని మహేంద్రా హిల్స్‌లో ఆమె విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సోనియాను ప్రతి ఒక్కరూ తెలంగాణ తల్లిగా కొలుస్తున్నారని, ఆమెకు గుడి కట్టించడం తమ లక్ష్యమన్నారు.

ఇందుకుగాను మహేంద్రాహిల్స్‌లోని 350 ఎకరాల ప్రభుత్వ స్థలంలో తమకు రెండు ఎకరాల స్థలాన్ని కేటాయించాలని కోరుతూ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రికి లేఖ రాసినట్టు చెప్పారు. సోనియా విగ్రహానికి ఎలాంటి దోషాలు లేని మంచి డిజైన్‌ను సూచించాలని శంకర్ రావు వేద పండితులను కోరారు.

English summary

 Former Minister and Contonment MLA Shankar Rao make interesting comments on Thursday on Chief Minister issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X