వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ సభ: చిరు అల్లుడు భరద్వాజ్‌కు షాక్

By Pratap
|
Google Oneindia TeluguNews

Sirish Bharadwaj sideline during Modi meeting
హైదరాబాద్: గుజరాత్ ముఖ్యమంత్రి, బిజెపి రథసారథి నరేంద్ర మోడీ వద్ద నేరుగా ప్రత్యక్షమైన కేంద్ర మంత్రి చిరంజీవి అల్లుడు శిరీష్ భరద్వాజ్‌కు హైదరాబాద్ సభలో షాక్ తగిలింది. మోడీ నవభారత్ యువభేరీ సభ సందర్భంగా ఆయన ఎక్కడా కనిపించలేదు. అయితే, ఇందులో బయటివారి పాత్ర ఏ మాత్రం లేదని అంటున్నారు. నరేంద్ర మోడీని హైదరాబాదులో నరేంద్ర మోడీని కలిసినవారిలో చిరంజీవి బావమరిది అల్లు అరవింద్ కూడా ఉన్నారు.

అయితే, శిరీష్ భరద్వాజ్‌కు హైదరాబాద్ సభలో ప్రాధాన్యం లభించకపోవడానికి దానికి ఏ మాత్రం సంబంధం లేదు. రాష్ట్రానికి చెందిన కార్యకర్తలే శిరీష్ భరద్వాజ్ పట్ల అక్కసుతో ఉన్నారట. రాష్ట్ర పార్టీతో గానీ, తమతో గానీ ఏ మాత్రం సంబంధం లేకుండా ఆయన నేరుగా మోడీ వద్ద తేలడం వారిని అసంతృప్తికి గురిచేసినట్లు చెబుతున్నారు.

నరేంద్ర మోడీ చిత్రంతో కలిసి శిరీష్ భరద్వాజ్ చిత్రం ఉన్న హోర్డింగులో హైదరాబాదులో కొన్ని చోట్ల దర్శనమిచ్చాయి. దానివల్ల ఆయన మోడీ సభలో ప్రాధాన్యం లభిస్తుందని భావించారు. కానీ రాష్ట్ర నాయకులు శిరీష్ భరద్వాజ్‌ను పట్టించుకోకూడదనే నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు.

శిరీష్ భరద్వాజ్ పార్టీకి ఉపయోగడేట్లు కూడా లేరనే భావన పెరిగినట్లు చెబుతున్నారు. చిరంజీవిపై శిరీష్ విమర్శలు చేస్తే వాడుకుందామని రాష్ట్ర బిజెపి నాయకులు అనుకున్నారట. అయితే, దానికి ఆయన సిద్ధపడకపోవడంతో కూడా అసంతృప్తికి గురైనట్లు చెబుతున్నారు.

English summary

 It is said that Chiranjeevi' son-in-law Sirish Bharadwaj has been sidelined during Gujarath CM and BJP leader Narendra Modi's Navabharath Yuvabheri Hyderabad meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X