వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీశాంత్ రాహుల్ ద్రావిడ్‌తో గొడవ పడ్డాడా?

By Pratap
|
Google Oneindia TeluguNews

Sreesanth confronted with Dravid
ముంబై: జెంటిల్మెన్ రాహుల్ ద్రావిడ్‌తో పేసర్ శ్రీశాంత్ గొడవ పడ్డాడట. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌ రాహుల్ ద్రావిడ్‌తో శ్రీశాంత్ కేవలం తుది జట్టులోకి తీసుకోకపోవడంతో మనస్తాపానికి గురై గొడవ పడ్డాడని భావించారట. తాను ఇండియాలో బెస్ట్ పేసర్‌ను అని, తనను తుది జట్టు నుంచి పక్కన పెట్టడమేమిటని అతను ద్రావిడ్‌తో కయ్యానికి దిగాడని ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రికలో అచ్చయిన వార్తాకథనం తెలిపింది. బుక్కీల ఒత్తిడితోనే ద్రావిడ్‌తో శ్రీశాంత్ గొడవ పడ్డాడని ఇప్పుడు అర్థమవుతోందని అంటున్నారు.

మరో విషయాన్ని కూడా ఆ పత్రిక రాసింది. అసలు శ్రీశాంత్‌ను రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యాం బయటకు పంపించేసిందట. అతని తంత్రాలతో విసిగి శ్రీశాంత్‌కు పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించి బయటకు పంపించేసినట్లు చెబుతున్నారు. దానివల్ల ఈ నెల 16వ తేదీన శ్రీశాంత్ ఉండడంలో అర్థమే లేదని అంటున్నారు.

మే 9వ తేదీన పంజాబ్‌తో మొహాలీలో జరిగిన మ్యాచులో శ్రీశాంత్‌తో ఆడించడం ద్రావిడ్‌కు ఇష్టం లేదట. కానీ, తుది జట్టులోకి రావడానికి శ్రీశాంత్ నానా ఎత్తులు వేశాడట. అలా వచ్చి టవల్ చుట్టుకుని బుక్కీ సూచనల మేరకు 13 పరుగులు ఇచ్చేసుకున్నాడు.

ముంబైతో ఈ నెల 15వ తేదీన జరిగిన మ్యాచునాటికి రాజస్థాన్ రాయల్స్ అతనితో తెగదెంపులు చేసుకుందట. అందువల్ల ముంబైలో 16వ తేదీన అతను ఉండాల్సిన అవసరమే లేదని అంటున్నారు. చెన్నైతో 12వ తేదీన మ్యాచ్ ముగిసిన వెంటనే శ్రీశాంత్‌కు ఉద్వాసన పలికినట్లు చెబుతున్నారు. జైపూర్‌లోని హోటల్‌ను ఖాళీ చేయాలని కూడా చెప్పారట.

కానీ, శ్రీశాంత్ ముంబైలోనే ఉండిపోయి పోలీసులకు చిక్కిపోయాడు. అయితే, స్పాట్ ఫిక్సింగ్ అనుమానాలు రాజస్థాన్ రాయల్స్‌కు రాలేదట గానీ శ్రీశాంత్ తంత్రాలతో విసిగిపోయి ఉద్వాసన పలికారట.

English summary

 According to media reports - Team sources said skipper Rahul Dravid didn't want the pacer to play against Punjab in Mohali on May 9. But Sreesanth kept his spot, tucked in a towel and gave away 13 runs as per instructions from a bookie.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X