వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బుకీ కూతురితో సురేష్ రైనా, మురళీ విజయ్

By Pratap
|
Google Oneindia TeluguNews

Suresh Raina and Murali Vijay
చెన్నై: క్రికెటర్ల సంబంధాలు రోజురోజుకూ వివాదాలు సృష్టిస్తున్నాయి. రాజస్థాన్ రాయల్స్ జట్టు ఫిక్సింగ్ వివాదంలో చిక్కుకోగా, చెన్నై సూపర్ కింగ్స్‌ను బెట్టింగ్ వ్యవహారం తగులుకుంది. చెన్నైలో ఓ బుక్కీ కూతురితో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు సురేష్ రైనా, మురళీ విజయ్ ఫోటోలు దిగడం వివాదంగా మారింది. చెన్నైలో ఓ బుకీ కూతురు బెట్టింగ్ వ్యవహారన్ని నడుపుతున్నట్లు పోలీసులు చెప్పారు.

చెన్నై బుకీ ప్రశాంత్ కూతురితో సురేష్ రైనా, విజయ్ ఫొటోలు వెలుగు చూశాయి. ఐపియల్ మ్యాచుల తర్వాతి పార్టీలు సాధారణంగా కొద్ది మందికి మాత్రమే పరిమితమవుతాయి. ఆ పార్టీలో ఆ బుకీ కూతురు కనిపిస్తూ ఉండేది. ఆమెకు కొంత మంది క్రికెటర్లతో మంచి సంబంధాలున్నాయని అంటున్ారు.

చెన్నై సూపర్ కింగ్స్ యజమాని గురునాథ్ ఎవియం కుటుంబానికి చెందినవాడు. అతనికి తమిళ సినీ పరిశ్రమతో మంచి సంబంధాలున్నాయి. దీంతో చాలా మంది సినీ తారలు పార్టీలకు హాజరయ్యేవారు. తొలి ఐపియల్ సందర్భంగా సినీ నటి లక్ష్మీరాయ్ మహేంద్ర సింగ్ ధోనీ బైక్‌పై కనిపించింది. తర్వాత ఆమె శ్రీశాంత్‌తో కలిసి ఫొటో షూట్‌లో పాల్గొంది.

పాకిస్తాన్ అంపైర్ అసద్ రవూఫ్ ఉదంతంతో క్రికెట్ కుదేలైందని అంపైర్ డికీ బర్డ్ వ్యాఖ్యానించాడు. ఫిక్సింగ్‌లో రవూఫ్ పాత్ర ఉన్నట్లు రుజువైతే అతన్ని ఎన్నడూ అంపైరింగ్‌కు అనుమతించరాదని అన్నాడు.

English summary
It is said that Chennai Super Kings players Suresh Raina and Murali Vijay are having relation with a bookie's daughter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X