వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తరుణ్ తేజ్‌పాల్ బలవంతం చేయలేదట!

By Pratap
|
Google Oneindia TeluguNews

ముంబై: లైంగిక దాడి కేసును ఎదుర్కుంటున్న తరుణ్ తేజ్‌పాల్ కొత్త మార్గం ఎన్నుకున్నాడు.లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న తెహల్కా మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్ అది బలవంతపు చర్య కాదని, ఆమెకు తెలిసే జరిగిందని చెప్పినట్లు పోలీసులు తెలిపారు. అయితే, బాధిత మహిళా జర్నలిస్టు మాత్రం తేజ్‌పాల్ లైంగిక దాడికి పాల్పడినట్లు చెబుతోంది.

తేజ్‌పాల్ కస్టడీ గడువు శుక్రవారంతో ముగియనుండడంతో పొడిగింపు కోరాలని పోలీసులు భావిస్తున్నారు. విచారణలో ఆయన వెల్లడించిన వివరాల మేరకు మేనేజింగ్ ఎడిటర్ షోమా ఛౌదరితోపాటు మరో ముగ్గురికి సమన్లు జారీ చేశామన్నారు. మరోవైపు ఈ కేసుపై మహిళా జడ్జితో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తామని గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ చెప్పారు.

Tarun Tejpal

తరుణ్ తేజ్‌పాల్‌ను లైంగిక దాడి కేసులో గోవా పోలీసులు అరెస్టు చేసి, తమ కస్టడీలోకి తీసుకుని విచారించారు. తరుణ్ తేజ్‌పాల్‌పై మహిళా జర్నలిస్టు లైంగిక దాడి చేశాడంటూ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

గోవాలో తరుణ్ తేజ్‌పాల్ ఓ కార్యక్రమం సందర్భంగా హోటల్లో మహిళా జర్నలిస్టుపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.

English summary
Tehelka founder editor Tarun Tejpal told to the police that it was not an assualt.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X