వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అరుణాచలం స్పీడ్‌కు జగన్ శిబిరం అదిరిందా?

By Pratap
|
Google Oneindia TeluguNews

 YS Jagan
హైదరాబాద్: అతనికంటే ఘనుడు ఆచంట మల్లన్న అనే రీతిలో సిబిఐ కొత్త జాయింట్ డైరెక్టర్ అరుణాచలం వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తున్నారు. గత జెడి లక్ష్మినారాయణ కన్నా ఈయన దూకుడుగా వ్యవహరిస్తున్నాడనే అభిప్రాయానికి మాత్రం బలం చేకూరింది. జగన్ అక్రమాస్తుల కేసును దర్యాప్తు చేస్తున్న సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ బదిలీపై వెళ్లగా ఆ స్థానంలో తమిళనాడుకు చెందిన అరుణాచలం బాధ్యతలు స్వీకరించారు.

ఈ కేసును పరిశీలించి నిర్ణయాలు తీసుకునేందుకు అరుణాచలానికి చాలా సమయమే పడుతుందని అనుకున్నారు. కానీ ఇలా వచ్చి ఆలా రెండుమూడు రోజులకే జగన్ అక్రమాస్తుల కేసులో అదనపు చార్జిషీటు దాఖలు చేశారు.ఈ స్పీడ్‌కు వైయస్ జగన్ శిబిరంలో కలకలం ప్రారంభమైనట్లు చెబుతున్నారు.

సిబిఐ జెడి అరుణాచలం దూకుడు వల్ల లాభం కలిగే అవకాశం ఉందని అంటున్నారు. అరుణాచలం జగన్ అక్రమాస్తుల కేసు దర్యాప్తును త్వరగా ముగిస్తే వైయస్ జగన్‌ చంచల్ గూడ జైలు నుంచి బెయిలుపై త్వరగా వచ్చేసే అవకాశాలుంటాయని అంటున్నారు. దానివల్ల పార్టీని ఎన్నికల దిశగా మరింత సమర్థంగా నడిపించవచ్చునని భావిస్తున్నారు.

వైయస్ జగన్ ఆస్తుల కేసు దర్యాప్తు ముగించి, చార్జిషీట్లు దాఖలు చేయడానికి ఇంకో మూడు, నాలుగు నెలలైనా పట్టవచ్చునని అంటున్నారు. ఏమైనా, ఎన్నికల లోపు జగన్ జైలు నుంచి బయటకు వస్తాడా, లేదా చెప్పలేని పరిస్థితే ఉంది.

English summary
The YSR Congress party leaders in worry seeing CBI new JD Arunachalam's speed. CBI has filed additional chargesheet in YS Jagan case after Arunachalam taking responsibilities.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X