వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోహన్‌బాబుకు జగన్ చేయిచ్చారా?

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan - Mohan Babu
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కలెక్షన్ కింగ్ మోహన్ బాబుకు చేయిచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. మోహన్ బాబు వైయస్సార్ కాంగ్రెసులో చేరడానికి సిద్ధపడినట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అందుకు ఊతం ఇస్తూ మోహన్ బాబు అప్పుడప్పుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గురించి ప్రస్తావిస్తూ వచ్చారు.

పార్టీలో చేరడానికి మోహన్ బాబు వైయస్ జగన్‌కు కొన్ని షరతులు పెట్టినట్లు చెబుతున్నారు. ఆ షరతులకు జగన్ అంగీకరించలేదని అంటున్నారు. మోహన్ బాబును పార్టీలో చేరవలసిందిగా జగన్, పార్టీ నాయకులు కోరారట. కానీ ఆయనకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు పచ్చజెండా ఊపలేదని అంటున్నారు.

తను పార్టీలోకి వస్తే చిత్తూరు లేదా తిరుపతి లోకసభ స్థానాలు వెనుకబడిన వర్గాలకు వెళ్లిపోయాయి కాబట్టి కోస్తాంధ్రలో విజయావకాశాలు గల నియోజకవర్గాల్లో టిక్కెట్టు ఇవ్వాలని మోహన్ బాబు ఇటీవల జగన్‌ను కలిసినప్పుడు కోరినట్లు సమాచారం.

అయితే, 2014 ఎన్నికల షెడ్యూలు విడుదలయ్యే వరకూ ఎవ్వరికీ టిక్కెట్లు ఖరారు చేయబోమనీ, ఆ తర్వాతే ఎవరికి టికెట్లు ఇచ్చేది నిర్ణయిస్తామని జగన్ కచ్చితంగా చెప్పినట్లు సమాచారం. దీంతో మోహన్ బాబు ప్రస్తుతానికి మౌనం పాటించి 2014 ఎన్నికల సమయంలో తాను ఏ పార్టీలో చేరేది వెల్లడిస్తారని అంటున్నారు. మోహన్ బాబు వైయస్ జగన్ కుటుంబానికి బంధువు అవుతారనే విషయం తెలిసిందే.

English summary
It is said that Mohan babu put conditions to YSR Congress party president YS Jagan to join in the party. But, YS Jagan not reacted positively to Mohanbabu's conditions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X