వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆపరేషన్ 'సన్': ఆ ఇద్దరిపై జగన్ కన్ను

By Srinivas
|
Google Oneindia TeluguNews

Uma Madhava Reddy-Ayyanna Patrudu
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తన ఆపరేషన్ ఆకర్ష్‌కు మరింత పదును పెట్టారు. ముందస్తు ఎన్నికల ప్రచారం జోరందుకున్న సమయంలో వైయస్సార్ కాంగ్రెసు తన వ్యూహాలతో దూకుడును పెంచింది. అధికార కాంగ్రెసును ఇప్పటికే దాదాపు చావుదెబ్బ తీసిన జగన్ పార్టీ ఇప్పుడు టిడిపిని మరింత దెబ్బతీసే ప్రయత్నాల్లో ఉన్నట్లుగా కనిపిస్తోంది. అందులో భాగంగా ఆపరేషన్ ఆకర్ష్‌కు పదును పెట్టినట్లుగా కనిపిస్తోంది.

ఇటీవల జరిగిన సహకార ఎన్నికల ఫలితాల తర్వాత టిడిపిలో దూకుడు కొంత పెరిగింది. ఈ దూకుడును వలసల వ్యూహంతో తిప్పికొట్టాలని జగన్ పార్టీ భావిస్తోందట. టిడిపి ఇటు సీమాంధ్రలో అటు తెలంగాణలో క్రమంగా పుంజుకుంటోంది. గతంలో దెబ్బతిన్న టిడిపి ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం వంటి చోట్ల జగన్ పార్టీని మూడో స్థానానికి నెట్టేసింది. అదే సమయంలో బాబు పాదయాత్ర టిడిపిలో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.

వీటిని దృష్టిలో పెట్టుకొని ఎన్నికలకు తమ పార్టీ సిద్ధంగా ఉండాలంటే కాంగ్రెసు పార్టీ కంటే ఇప్పుడు టిడిపిని టార్గెట్‌గా పెట్టుకోవడమే మంచిదనే భావనలో జగన్ పార్టీ ఉందట. కాంగ్రెసు నేతల వైపు దృష్టి సారించినా టిడిపిపై ప్రత్యేక దృష్టి పెట్టేందుకు సిద్ధమయ్యారట. ఆయా జిల్లాలకు చెందిన పలువురికి గాలం వేసే పనిలో పెట్టారట. తెలంగాణలోను టిడిపికి గట్టి షాక్ ఇచ్చే ప్రయత్నాల్లో ఉన్నారట. సహకారం తర్వాత ఓ ఎమ్మెల్సీ, ఓ ఎమ్మెల్యే, ఓ మాజీ జగన్ పార్టీకి జై కొట్టారు.

టిడిపి సీనియర్లు అయ్యన్నపాత్రుడు, ఉమామాధవ రెడ్డిలపై జగన్ శిబిరం కన్నేసిందట. దీంతో వారి తనయులతో చర్చలు జరిపే ప్రయత్నాలు చేస్తోందట. తనయుల ద్వారా ఈ సీనియర్లను తమ వైపుకు రప్పించే ప్రయత్నాలు చేస్తోందట. అయితే, అయ్యన్న, ఉమ వంటి నేతల నుండి మాత్రం ఎలాంటి స్పందన లేదట. జగన్ పార్టీ ఎంతగా ప్రయత్నించినా వారు పార్టీని వీడేందుకు ఆసక్తి చూపే అవకాశాలు లేవంటున్నారు.

English summary
YSR Congress Party is planning to attract Telugudesam Party senior leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X