బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వివాదాస్పద స్వామి నిత్యానంద పురుషుడే!

By Pratap
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: వివాదాస్పద నిత్యానంద స్వామి పురుషుడేనని తేలింది. ఆయనకు నిర్వహించిన లైంగిక సామర్థ్య పరీక్షలలో ఈ మేరకు వెల్లడైందని సీఐడీ అధికారులు వెల్లడించారు. సీఐడీ డీఎస్పీ లోకేశ్‌ నేతృత్వంలోని పోలీసు బృందం ఈ మేరకు వైదుల ధ్రువీకరణ పత్రాలతో కూడిన నివేదికను రామనగర్‌లోని సెషన్స్‌ కోర్టుకు సమర్పించింది.

ఇటీవల నగరంలోని విక్టోరియా ఆస్పత్రిలో ప్రఖ్యాత వైద్యబృందం నిత్యానందకు పురుషత్వ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఆయనకు ఎటువంటి లోపమూ లేదని నివేదికలో వైద్యులు పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, తనకు పురుషత్వ పరీక్షలు నిర్వహించాలన్న రాష్ట్ర హైకోర్టు ఆదేశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిత్యానంద సుప్రీంకోర్టును ఆశ్రయించగా, పరీక్షలు నిర్వహించాల్సిందేనని, వైద్యులకు సహకరించాలని సుప్రీం ఆదేశించిన విషయం విదితమే.

CID says Nithyanada is man

తనకు పురుషత్వ పరీక్షలు నిర్వహించకుండా చూడాలని ఆయన పెట్టుకున్న పిటీషన్‌ను అత్యున్నత న్యాయస్దానం గతంలో సుప్రీం కోర్టు కొట్టేసింది. అత్యాచార కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద పురషత్వ పరీక్ష చేయించుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. నిత్యానందకు పురుషత్వ పరీక్షలు నిర్వహించడానికి కర్ణాటక హైకోర్టు గత నెలలో అనుమతించిన విషయం తెలిసిందే. గతంలో ఇదే విషయంపై సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది. నిత్యానంద మాజీ శిష్యురాలు ఒకరు నిత్యానంద తనను శారీరకంగా వేధించాడని తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈ వ్యవహారంలో నిత్యానందను అరెస్ట్ చేయడానికి వెళ్లిన పోలీసులకు నిత్యానంద దొరకలేదు. దీంతో, నిత్యానంద కేసు కోర్టుకు చేరింది. కేసును విచారించిన రామనగర సెషన్స్ కోర్టు నిత్యానందకు పురుషత్వ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. దీనికి సంబంధించి నిత్యానంద పైకోర్టుకు అప్పీల్ చేశాడు. తాను బాలుడితో సమానమని, తనకు సెక్స్ సామర్థ్యం లేదంటూ కోర్టుకు తెలిపాడు. దీంతో, నిత్యానందకు పురుషత్వ పరీక్షలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది.

English summary
According to CID report - Potency test prooved that Nithyananda Swami is a man.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X