వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

24 గంటల్లోనే సచిన్‌కు భారతరత్న నిర్ణయం

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్‌కు భారతరత్న పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ముందుగా కసరత్తు చేసి ఇవ్వలేదట. కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే, అదీ సచిన్ 200వ టెస్టు ఆడిన మరుసటి రోజు ఖరారు చేసిందట. భారతరత్న అత్యున్నత పురస్కారం.

దీనిని సచిన్ టెండుల్కర్‌కు ఇవ్వాలనే వాదన చాలా రోజులుగా ఉంది. సచిన్ పేరును భారతరత్నకు అనుకున్నప్పుడల్లా ధ్యాన్ చంద్ వంటి పేర్లు కూడా వినిపించాయి. గత ఏడాది సచిన్‌కు భారతరత్న పురస్కారం ఇస్తున్నట్లు ప్రకటించారు.

Sachin Tendulkar

సచిన్‌కు భారతరత్న కేంద్రం ముందుగా ఆలోచించి, కసరత్తు చేసి ఖరారు చేయలేదని సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా వెలుగు చూసింది.

నవంబర్ 14న సచిన్ ముంబై వాంఖెడే స్టేడియంలో చివరి టెస్టు మ్యాచ్ ఆడుతున్నాడు. ఆ సమయంలో సచిన్ వివరాలు పంపాలని ప్రధానమంత్రి కార్యాలయం క్రీడా శాఖను అదే రోజు మధ్యాహ్నం 1.35 నిమిషాలకు కోరింది. అక్కడి నుండి వివరాలు సాయంత్రం 5.22 నిమిషాలకు ప్రధానమంత్రి కార్యాలయానికి చేరుకున్నాయి.

మరుసటి రోజు అంటే నవంబర్ 15న ప్రధాని దానికి ఓకే చెప్పారు. వెంటనే సచిన్ పేరును భారతరత్నకు సిఫార్సు చేస్తూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఫైలును పంపించారు.

English summary
The process of conferring the country's highest civilian honour Bharat Ratna on batting maestro Sachin Tendulkar was initiated on the first day of his farewell 200th cricket Test on November 14, 2013 and the announcement made two days later, according to an RTI reply
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X