హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లాస్ట్‌మినట్లో నదిలో ఇలా ఫోటోలు దిగి..(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: విద్యార్థులు ఓ గంట ముందు వెళ్లినా లేదా ఆలస్యంగా వెళ్లినా బియాస్ నది దుర్ఘటన జరిగేది కాదేమో అంటున్నారు. వాస్తవానికి విద్యార్థుల పర్యటనలో బియాస్ నది వద్ద ఆగాలని ముందుగా అనుకోలేదు. ప్రణాళిక ప్రకారం ఆదివారం సాయంత్రం ఆరు గంటల లోపు విద్యార్థుల బృందం సిమ్లా నుండి కులూ మనాలికి వెళ్లాల్సి ఉంది. అక్కడ నదీ విహారం చేయాలనుకున్నారు.

అయితే సాయంత్రం ఆరు దాటితే నదిలో విహారానికి అనుమతి లేదని తెలియడంతో.. అప్పటికల్లా చేరుకున అవకాశం లేదని అంచనాకు రావడంతో ప్రకృతి అందాలను చూసుకుంటూ బస్సులో నెమ్మదిగా ముందుకు వెళ్లారు. కులూకు 10 కిలోమీటర్ల దూరంలో ఉండగా మార్గమధ్యలోని బియాస్ నది వద్ద ఆగారు. ఆరుంపావుకు నది మధ్యలోని బండరాళ్ల వద్ద ఫోటోలు దిగేందుకు వెళ్లి ప్రమాదంలో చిక్కుకుపోయారు.

వారు కనుక కొంత ముందుగానే కులూకు చేరుకొని ఉంటే నదీ విహారానికే వెళ్లేవారు. మధ్యలో ఆగక పోయి ఉండేవారు. అలాకాకపోయినా ఎలాగు ఆలస్యమైంది కనుక.. మరో పావుగంట ఆలస్యమేతే.. డ్యాం గేట్లు తెరిచి ఉండేవారు కాబట్టి అటు వైపుకు రాకపోయి ఉండేవారంటున్నారు. ఉత్సాహంగా ఫోటోలు దిగుదామని బండరాళ్ల పైకి ఎక్కిన విద్యార్థులను నది కబలించింది. ప్రవాహం తక్కువగా ఉండటంతో విద్యార్థులు ఫోటో తీయించుకుందామనుకున్నారు.

పక్కనే ఉన్న చిన్న చిన్న రాళ్లపై నిలబడ్డారు. రాళ్ల పైకి ఎక్కి, ఫోటోలు తీసుకుంటుండగానే వరద ఉధృతి పెరిగింది. చిన్న చిన్న రాళ్లపై ఉన్న వారు వరద ఉధృతి చూసి వేగంగా ఒడ్డుకు వచ్చారు. పెద్ద బండరాయి మీద ఎక్కిన వాళ్లు మాత్రం దిగడానికి వీల్లేక అక్కడే ఉండిపోయారు. పెద్ద బండ రాయి పైన ఉన్న వారు... నీటి ప్రవాహం తగ్గగానే దిగిపోదామనే ఆలోచనలో ఉండగానే.. నీటి ప్రవాహం అంతకంతకు పెరగడంతో వారు కొట్టుకు పోయారట.

బియాస్

బియాస్

హిమాచల్ ప్రదేశ్‌లోని లార్జీ డ్యాం నుండి నీటిని వదలడానికి ముందు.. బ్యారేజీకి ఒకటి రెండు కిలోమీటర్ల దూరంలో విద్యార్థులు ఫోటోలు దిగారు. విద్యార్థులు సెల్‌ఫోన్‌లలో తీసుకున్న చిత్రాలు.

బియాస్

బియాస్

హిమాచల్ ప్రదేశ్‌లోని లార్జీ డ్యాం నుండి నీటిని వదలడానికి ముందు.. బ్యారేజీకి ఒకటి రెండు కిలోమీటర్ల దూరంలో విద్యార్థులు ఫోటోలు దిగారు. విద్యార్థులు పెద్ద బండరాయి ఎక్కిన దృశ్యం. విద్యార్థులు సెల్‌ఫోన్‌లలో తీసుకున్న చిత్రాలు.

హిమాచల్ ప్రదేశ్‌లోని లార్జీ డ్యాం నుండి నీటిని వదలడానికి ముందు.. బ్యారేజీకి ఒకటి రెండు కిలోమీటర్ల దూరంలో విద్యార్థులు ఫోటోలు దిగారు. వారికి ఎగువన నది మలుపు తిరిగి ఉండటంతో దూసుకు వస్తున్న వరద ప్రవాహం విద్యార్థులకు కనిపించే అవకాశం లేకుండా పోయింది. ఇదే వారి ప్రాణాల మీదకు తెచ్చింది. విద్యార్థులు సెల్‌ఫోన్‌లో తీసుకున్న చిత్రాలు.

బియాస్

బియాస్

హిమాచల్ ప్రదేశ్‌లోని లార్జీ డ్యాం నుండి నీటిని వదలడానికి ముందు.. బ్యారేజీకి ఒకటి రెండు కిలోమీటర్ల దూరంలో విద్యార్థులు ఫోటోలు దిగారు. విద్యార్థులు పెద్ద బండరాయి ఎక్కిన దృశ్యం. విద్యార్థులు సెల్‌ఫోన్‌లలో తీసుకున్న చిత్రాలు.

బియాస్

బియాస్

హిమాచల్ ప్రదేశ్‌లోని లార్జీ డ్యాం నుండి నీటిని వదలడానికి ముందు.. బ్యారేజీకి ఒకటి రెండు కిలోమీటర్ల దూరంలో విద్యార్థులు ఫోటోలు దిగారు. విద్యార్థులు పెద్ద బండరాయి ఎక్కిన దృశ్యం. విద్యార్థులు సెల్‌ఫోన్‌లలో తీసుకున్న చిత్రాలు.

బియాస్

బియాస్

హిమాచల్ ప్రదేశ్‌లోని లార్జీ డ్యాం నుండి నీటిని వదలడానికి ముందు.. బ్యారేజీకి ఒకటి రెండు కిలోమీటర్ల దూరంలో విద్యార్థులు ఫోటోలు దిగారు. విద్యార్థులు పెద్ద బండరాయి ఎక్కిన దృశ్యం. విద్యార్థులు సెల్‌ఫోన్‌లలో తీసుకున్న చిత్రాలు.

English summary
Himachal Pradesh tragedy: Photos of students
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X