వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జపాన్‌లో మోడీ కృష్ణుడి కథ, చైనాపై ఫైర్(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

టోక్యో: భారత ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ఒక ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. చిన్నారులతో చక్కగా కలిసిమెలిసి తిరిగారు. వారికి శ్రీకృష్ణుడి కథను చెప్పారు. సుమారు ఏడెనిమిదేళ్ల వయస్సు చిన్నారులు అందరు ఒక బృందంగా ఏర్పడి నరేంద్ర మోడీ కోసం ప్రత్యేకంగా ఒక పాట పాడారు. ఆయన కోసం వాద్య సంగీతాన్ని వినిపించారు. కొందరు వేణువు వాయించడం చూసిన మోడీ వారందరినీ తన చుట్టూ చేర్చుకొని శ్రీకృష్ణుడి కథను చెప్పారు. కృష్ణుడు వేణుగానలోలుడని, ఆయన మురళీగాన రవళికి అందరు సమ్మోహితులవుతారని చెప్పారు.య గోవులు ఆయన చుట్టు చేరేవంటూ వివరించారు.

ఆ తర్వాత ఆయన వారి కోసం వేణువు వాయిస్తుంటే పిల్లలు అందరు ఎంతో ఆసక్తిగా విన్నారు. జపాన్ విద్యావిధానం గురించి మోడీ అడిగి తెలుసుకున్నారు. 136 ఏళ్ల నాటి అతి పురాతన పాఠశాలను కూడా మోడీ సోమవారం సందర్శించారు. భారత్‌లో జపనీస్ భాషను బోధించేందుకు రావాల్సిందిగా అధ్యాపకులను కోరారు. ఆన్ లైన్ కోర్సులను కూడా ఆయన ప్రతిపాదించారు.

మరోవైపు, మోడీ చైనా పైన మోడీ విరుచుకు పడ్డారు. జపాన్ వ్యాపారవేత్తలతో జరిగిన సమావేశంలో మోడీ మాట్లాడుతూ.. విస్తరణ వాదంతో వెర్రిపోకడలు పోతున్న దేశాలు ఇతర దేశాల సముద్ర జలాల్లోకి చొరబడి దురాక్రమణకు పాల్పడుతున్నాయన్నారు.21వ శతాబ్దంలో వికాస(అభివృద్ధి)వాదానికి తప్ప, విస్తరణ వాదానికి చోటు లేదన్నారు. వికాసవాదం కావాలో, విస్తరణవాదం కావాలో మనమే నిర్ణయించుకోవాలన్నారు.

విస్తరణవాదాన్ని అనుసరిస్తే ప్రపంచం ముక్కచెక్కలవుతుందన్నారు. బుద్ధుడి మార్గంలో నడుస్తూ వికాసంపై నమ్మకం ఉన్న దేశాలే అభివృద్ధి పథంలో దూసుకు పోతాయన్నారు. అయితే ఇప్పటికీ కొన్ని దేశాలు( చైనాను ఉద్దేశించి) ఇతర దేశాలు భూభాగాలు, సముద్రప్రాంతాలు తమవేనంటూ చొరబడుతున్నాయని మోడీ విమర్శించారు. 18వ శతాబ్దంలో రాజులు విపరీతమైన రాజ్యకాంక్షతో పరాయి దేశాలను ఆక్రమించుకునేవారని, అలాంటి విపరీత కాంక్ష ప్రస్తుతం మన చుట్టుప్రక్కల ఉన్న ఓ దేశంలో కనపడుతోందన్నారు.

 నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

భారత ప్రధాని నరేంద్ర మోడీ టోక్యోలోని ఓ పాఠశాలలో విద్యార్థులకు పాఠాలు బోధించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం మోడీ జపాన్ వచ్చారు.

 నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

మూడో రోజు సోమవారం తైనీ ప్రాథమిక పాఠశాలను సందర్శించిన నరేంద్ర మోడీ జపాన్‌లో విద్యా విధానం అమలు తీరును పరిశీలించారు.

నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

ఆ తర్వాత విద్యార్థులతో కలిసిపోయిన ఆయన వాళ్లతో పాటు ఫ్లూట్ వాయించారు. పాఠశాలలో పిల్లలందరూ 7-8 ఎనిమిదేళ్ల వయసువారే.

నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

అదే సమయంలో పాఠశాలలో సంగీతం క్లాసులు జరుగుతుండడంతో మోడీ కూడా వాళ్లతో జతకలిశారు. పిల్లలలతోపాటు ఫ్లూట్ వాయించి ఉత్సాహపరిచారు.

 నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

ప్రధాని జపాన్ చిన్నారులకు కృష్ణ భగగవానుని గురించి కాసేపు పాఠాలు బోధించారు. భారత్ పురాణాలకు పుట్టినిల్లు అని, శ్రీకృష్ణుడు కూడా సంగీత ప్రియుడేనని, గోవులను ఆకట్టుకోడానికి కృష్ణుడు పిల్లన గ్రోవిని వాయించేవారని మోడీ చెప్పారు.

 నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

భారత్ - జపాన్ మధ్య మరింతగా సుహృద్భావ పరిస్థితులు పరిఢవిల్లబోతున్నాయి. రెండు దేశాలను వ్యాపార, వాణిజ్య, రక్షణ రంగాల్లో మరింత సన్నిహితం చేసే దిశగా సోమవారం బలమైన అడుగులుపడ్డాయి. భారత ప్రధాని నరేంద్ర మోడీ, జపాన్ ప్రధాని షింజో అబే మధ్య జరిగిన కీలక భేటీలో ఇరు దేశాల మధ్య రక్షణ, వ్యూహత్మక అనుబంధాన్ని మరింత దృఢపరిచాయి.

 నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

ఈ రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని ఉభయ దేశాలు అంగీకారానికి వచ్చాయి. సోమవారం జరిగిన శిఖరాగ్ర చర్చల్లో ఇరు దేశాల అధినేతలు ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు.

 నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

పౌర అణు ఒప్పందంపై భారత్- జపాన్ మధ్య జరుగుతున్న సంప్రదింపులు ప్రస్తుతం ముగియకపోయినప్పటికీ వీటిని మరింత వేగవంతం చేయాలని కూడా ఉభయ దేశాల ప్రధాన మంత్రులు నిర్ణయించారు.

 నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

ఆసియాతోపాటు ప్రపంచ శాంతి, భద్రతలకు భారత్, జపాన్‌ల పురోభివృద్ధి ఎంతో ముఖ్యమని వారు ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. భారత్‌లో తమ పెట్టుబడులను రెట్టింపుస్థాయికి పెంచి రానున్న ఐదేళ్లకాలంలో 3,500 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు జపాన్ ప్రధాని వెల్లడించారు.

 నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

అకాసకా ప్యాలెస్ (ప్రభుత్వ అతిథి గృహం)లో మూడో రోజు జరిగిన చర్చలు ఎంతో ఫలప్రదంగానూ, అర్ధవంతంగానూ కొనసాగాయని ప్రకటించారు. పాత మిత్రుడైన మోడీకి క్యోటోలో శనివారం స్వయంగా స్వాగతం పలికిన షింజో అబే ఈ వారమంతా ఆయనతోనే గడిపి మోడీ పట్ల తనకు గల గౌరవాన్ని చాటుకున్నారు.

English summary
Prime Minister Narendra Modi today visited an elementary school here and mingled with the students, narrating them the story of Lord Krishna.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X