వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నచ్చలేదు: చిరుపై మళ్లీ వర్మ, పవన్ కళ్యాణ్ పైనా

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రముఖ దర్శకులు రామ్ గోపాల్ వర్మ కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ ప్రచార చీఫ్ చిరంజీవి పైన మరోసారి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రస్తుతం తనకు చిరంజీవి రాజకీయ పాత్ర ఏమాత్రం నచ్చలేదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

తనకు వచ్చే ఆలోచనలను అప్పటికప్పుడు ట్వీట్ చేయడం అళవాటు అని, అంతే తప్ప తనకు రాజకీయాలు తెలియవన్నారు. కానీ, ప్రస్తుతం చిరంజీవి రాజకీయ పాత్ర తనకు నచ్చలేదని చెప్పారు. అదే విషయాన్ని తాను ట్విటర్‌లో పెట్టానని చెప్పారు.

Ram Gopal Varma again Chiranjeevi

'రౌడీ' చిత్రం ప్రమోషన్ కోసం శనివారం విశాఖపట్నం వచ్చిన రామ్ గోపాల్ వర్మ పై విధంగా వ్యాఖ్యలు చేశారు. మీడియాతో ముచ్చటించిన ఆయన విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఉన్న ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత రాష్ట్ర పరిస్థితుల నేపథ్యంలో ఆయన పార్టీ పెడితే మంచిదని భావించానని, అదే ట్విట్టర్‌లో పెట్టానని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

కాగా, రామ్ గోపాల్ వర్మ నాలుగు రోజుల క్రితం కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, మెగాస్టార్ చిరంజీవి పైన సంచలన ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెసు హఠావో - దేశ్ బచావో... చిరంజీవి హఠావో... రాష్ట్ర్ బచావో అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు మరింత సంచలనం సృష్టిస్తోంది.

English summary
Ram Gopal Varma takes on Union Tourism Minister Chiranjeevi again.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X