వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐటంగర్ల్ కంటే సోనియా ఆస్తి తక్కువే, కొడుక్కి అప్పు

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆస్తులు బాలీవుడ్ ఐటం గర్ల్ రాఖీ సావంత్ కంటే తక్కువ! సోనియా బుధవారం రాయ్ బరేలీ నుండి నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె తన ఆస్తులను వెల్లడించారు. ఆమె పేరు పైన ఎలాటి వాహనం లేనప్పటికీ రూ.9.28 కోట్లకు పైగా విలువైన ఆస్తులు మాత్రం ఉన్నాయి.

రాయ్ బరేలి స్థానానికి బుధవారం దాఖలు చేసిన నామినేషన్ పత్రాలతో పాటుగా సోనియా సమర్పించిన అఫిడవిట్ ప్రకారం ఆమెకు రూ. 2.81 కోట్ల చరాస్తులు, రూ.6.47 కోట్ల స్థిరాస్తులున్నాయి. గత ఎన్నికల్లో దాఖలు చేసిన డిక్లరేషన్‌తో పోల్చి చూస్తే ఈ అయిదేళ్ల కాలంలో సోనియా ఆస్తుల విలువ ఆరు రెట్లు పెరిగింది.

అయితే క్రితం సారి ఆస్తుల విలువను బుక్ వాల్యూ ప్రకారం ప్రకటించగా, ఈసారి మార్కెట్ విలువ ఆధారంగా ప్రకటించడమే ఈ పెరుగుదలకు కారణమని పార్టీ వర్గాలు అంటున్నాయి. సోనియా తన కుమారుడు రాహుల్ గాంధీకి రూ.10 లక్షల రుణం ఇచ్చినట్లుగా పేర్కొన్నారు. తన వార్షికాదాయం 14.21 లక్షలుగా 2012-13 ఆర్థిక సంవత్సరానికి గాను సమర్పించిన ఆదాయం పన్ను రిటర్న్స్‌లో చూపించారు.

Revealed: Sonia Gandhi is poorer than Rakhi Sawant

చరాస్తుల్లో చేతిలో 85 వేల నగదు ఉండగా, బ్యాంకులో 66 లక్షలు ఉంది. ఇది కాక పది లక్షల రూపాయల విలువైన బాండ్లు, లక్షా 90 వేల విలువైన షేర్లు ఉన్నాయి. అంతేకాకుండా 82.20 లక్షల రూపాయల విలువైన మ్యూచువల్ ఫండ్స్, 42.49 లక్షల రూపాయల పిపిఎఫ్. 2.86 లక్షల రూపాయల నేషనల్ సేవింగ్స్ స్కీమ్, 62 లక్షల రూపాయల విలువైన ఆభరణాలు సోనియాకు ఉన్నాయి.

చరాస్తుల్లో ఇటలీలో 19.90 లక్షల రూపాయల విలువైన పూర్వీకుల నివాసం ఒకటి ఉందని సోనియా అఫిడవిట్‌లో పేర్కొన్నారు. డేరామండి గ్రామంలో 4.86 కోట్ల రూపాయల విలువైన భూమి, సుల్తాన్‌పూర్ గ్రామంలో కోటి 40 లక్షల రూపాయల విలువైన మరో భూమి ఉంది. క్రితంసారి రాయ్ బరేలి నుంచి నామినేషన్ దాఖలు చేసే సమయంలో సోనియా కోటి 37 లక్షల రూపాయల విలువైన ఆస్తులను ప్రకటించారు.

English summary
As the Lok Sabha election is approaching fast, candidates of all political parties are filing their nominations and declaring details of their assets. Following the trend, Congress President Sonia Gandhi on Wednesday, April 2 filed her nomination for Rae Bareli seat in Uttar Pradesh and declared she has asset worth Rs 9 crore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X