వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

10లక్షలిచ్చేవాడ్ని!: పేరులేక డీసీఎంకి కోపమొచ్చింది

By Srinivas
|
Google Oneindia TeluguNews

వరంగల్ జిల్లా హన్మకొండలోని ఏకశిలా పార్కులో ఆచార్య జయశంకర్‌ జయంతి వేడుకల్లో కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. పార్కులో పది అడుగుల ఎత్తైన జయశంకర్‌ విగ్రహాన్ని స్పీకర్‌ మధుసూదనాచారి, ఉప ముఖ్యమంత్రి డాక్టర్ రాజయ్య, వరంగల్‌ పార్లమెంటు సభ్యుడు కడియం శ్రీహరి, వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ తదితరులు ఆవిష్కరించారు.

అయితే, విగ్రహం దిగువ భాగంలో ఫలకంపై శ్రీహరి, వినయ్‌ భాస్కర్‌, కలెక్టర్‌ జి కిషన్‌ పేర్లు మాత్రమే ఉన్నాయి. డిప్యూటీ సీఎం పేరు లేకపోవడంపై దళిత సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Telangana Dy.CM Rajaiah unhappy

ఎంపీ, ఎమ్మెల్యే చెరో రెండు లక్షలు ఇచ్చినందునే ఫలకంపై వారి పేర్లు పెట్టారట. ఇందుకు సంబంధించి ఓ పత్రికలో వార్త వచ్చింది. అయితే, దీని పైన రాజయ్య కూడా తీవ్రంగా స్పందించారట. తనను అడిగితే పది లక్షల రూపాయలు అయినా ఇద్దునని కలెక్టర్‌ను నిలదీశారట. పరిస్థితి తీవ్రతను గమనించిన కలెక్టర్.. తన వల్ల పొరబాటు జరిగుంటే సభా ముఖంగా క్షమాపణలు చెబుతున్నానని చెప్పడంతో రాజయ్య శాంతించారు.

English summary
Telangana Deputy Chief Minister Rajaiah unhappy with officials.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X