వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లక్ష్మినారాయణకు రాజకీయ గిరాకీ: బిజెపి గాలం

By Pratap
|
Google Oneindia TeluguNews

 Three ministers meet Chandrababu
హైదరాబాద్: ఓబుళాపురం గనులు, జగన్ అక్రమాస్తుల వంటి పలు అనేక సంచలనాత్మక కేసులను దర్యాప్తు చేసిన సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్, ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణకు రాజకీయంగా గిరాకీ పెరిగింది. ఇటీవల ఆయనను ఆమ్ ఆద్మీ పార్టీ ఆహ్వానించగా, ప్రస్తుతం బిజెపి నాయకులు ఆయనకు గాలం వేస్తున్నారట. బీజేపీ నేతలు ఆయనను తమ పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది.

మహారాష్ట్ర కేడర్‌కు చెందిన లక్ష్మీనారాయణ డిప్యుటేషన్‌లో భాగంగా సీబీఐ జేడీగా ఆంధ్రప్రదేశ్‌లో పనిచేశారు. డిప్యుటేషన్ ముగిసిన తర్వాత సుమారు 9 నెలలపాటు ఆయనకు మహారాష్ట్ర ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వలేదు. ఇటీవలే ఆయనను థానే జాయింట్ కమిషనర్‌గా నియమించింది. లక్ష్మీనారాయణ ఆంధ్రప్రదేశ్‌లో వివిద కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటున్నారు.

ఈ నేపథ్యంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆయనను సంప్రదించి, తమ పార్టీలోకి ఆహ్వానించినట్లు సమాచారం. అయితే, ఆయన సన్నిహితులు మాత్రం బీజేపీలో చేరితే బాగుంటుందని సలహా ఇచ్చినట్లు తెలిసింది. దీంతో బిజెపి నేతలు లక్ష్మీనారాయణతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డిలు లక్ష్మీనారాయణతో మాట్లాడినట్లు తెలిసింది. ఒకవేళ ఆయన బిజెపిలో చేరితే కర్నూలు నుంచి లోక్‌సభకు పోటీ చేసే అవకాశముందని అంటున్నారు. లేకపోతే మల్కాజిగిరి స్థానానికి పోటీ చేయవచ్చన్న వార్తలు వెలువడుతున్నాయి.

English summary
It is said that CBI former JD Lakshminarayana has been invited by the BJP leaders to join in their party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X